police shows fir copies, mudragada says arrest me in tuni case

High tension prevails in kirlampudi

mudragada hunger strike, mudragada padmanabham, kapu reservation stir, kapu garjana, tuni violence, mudragada padmanabham, amalapuram one town police station, Mudragada fast unto death, mudragada hunger strike, NTR,

Kapu caste leader Mudragada padmanbham, says cbcid to arrest me in tuni case, and asks police to vacate his houde

కిర్లంపూడిలో హైటెన్షన్.. ఎఫ్ఐఆర్ కాఫీలను తీసుకోచ్చిన పోలీసులు

Posted: 06/09/2016 10:23 AM IST
High tension prevails in kirlampudi

కాపు జాతి కోసం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అమరణ దీక్షకు పూనుకోవడంతో తూర్పగోదావరి జిల్లా కిర్లంపూడిలో హై టెన్షన్ నెలకోంది. అమరణ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసుల యత్నాలను అయన తిప్పికోట్టారు. తనను అమలాపురం పోలీస్ స్టేషన్ లో విధులను అటంకపర్చిన కేసులో అయనను అరెస్టు చేస్తున్నామని స్థానిక పోలీసులు అయన ఇంటికి చేరకున్నారు. దీంతో కాపు నేతలు వారిని ఇంటి బయలే నిలువరించారు. స్థానిక పోలీసులకు ముద్రగడ ఇంటిలోకి ప్రవేశం లేదని చెప్పారు.

అయితే తుని కేసుకు సంబంధించిన ఎఫ్ ఐ ఆర్ కాఫీలను పరిశీలించిన కాపు నేతలు ముద్రగడ అరెస్టును అడ్డుకున్నారు. చివరకు జిల్లా ఎస్సీ జోక్యం చేసుకుని అక్కడకు వచ్చారు. దీంతో తుని కేసును విచారిస్తున్న సిబిసిఐడి అధికారులు రావాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా ఎస్సీ ముద్రగడతో మాట్లాడేందుకు కూడా కాపు నేతలు వ్యతిరేకించారు. ఎస్సీ తమను సిబిసిఐడీ కార్యాలయానికి తీసుకువెళ్తానని చెప్పి, చివరకు కిర్లంపూడి ఇంటికి తరలించారన వారు అరోపించారు.

అయితే పోలీసులు మాత్రం ముద్రగడను ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేస్ాతమని భీష్మంచడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కిర్లంపూడి పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎర్రవరం, పత్తిపాడు, కిర్లంపూడిలో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.  కిర్లంపూడి వచ్చే వ్యక్తులను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ముద్రగడకు సంఘీభావంగా కాపులు పెద్ద ఎత్తున కిర్లంపూడికి తరలి వస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mudragada padma nabham  chandrababu naidu  kapu leaders  hunger strike  

Other Articles