ఎయిడ్స్ ఉందని రైలు కింద పడబోయారు, అంతలో... | couple try to commit suicide in nalgonda for wrong HIV reports

Couple try to commit suicide in nalgonda for wrong hiv reports

nalgonda couple, wrong HIV reports, couple commit suicide, నల్గోండ దంపతులు, హెచ్ఐవీ రిపోర్ట్, తప్పుడు హెచ్ఐవీ రిపోర్ట్, తాజావార్తలు, తెలంగాణ వార్తలు, latest news

couple try to commit suicide in nalgonda for wrong HIV reports

ఎయిడ్స్ ఉందని రైలు కింద పడబోయారు, అంతలో...

Posted: 06/09/2016 10:16 AM IST
Couple try to commit suicide in nalgonda for wrong hiv reports

ఒక్క చిన్ని తప్పు కారణంగా భారీ మూల్యాన్ని చెల్లించిన ఘటనలు ఎన్నో చూశాం. కానీ, ఏ తప్పు చేయకుండా, అసలు తమ ప్రమేయం లేకుండానే ఇక్కడ ఓ కుటుంబం చావబోయింది. ఎయిడ్స్ ఉందని తెలిసి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకోబోయారు. కానీ, ఆఖరి నిమిషంలో బందువుల జోక్యంతో ఆ దంపతులు బయటపడగలిగారు. దిగ్భ్రాంతి గురి చేసే ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్లితే..

పశ్చిమ బెంగాల్ కు చెందిన భార్యభర్తలు కొంత కాలం క్రితం నల్గొండ లోని చుండూరు మండల కేంద్రానికి వచ్చి స్థిరపడ్డారు. అక్కడ ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో నిర్వాహకురాలి భార్య గర్భవతి అయ్యింది. జూన్ 1న స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యపరీక్షలు చేయించుకోగా, ఆమెకు హెచ్ఐవీ ఉన్నట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. నిర్ఘాంతపోయిన ఆ దంపతులు అవమాన భారంతో కుంగిపోయారు, బతికి ఉండి ఏం లాభమని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లారు.

అయితే వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన బంధువులు ఎలాగోలా వారిని ఆపారు. ఆ ప్రయత్నాన్ని విరమింపజేసి ఇంటికి రప్పించుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం జిల్లా కేంద్రంలో మరోసారి వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఈసారి రిపోర్ట్ లలో వారికి హెచ్ ఐవీ లేదని రావటంతో షాక్ తిన్నారు. స్థానిక నాయకులకు వెంటపెట్టుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. తప్పుడు రిపోర్ట్ లపై సిబ్బందిని నిలదీయగా, సిబ్బంది ఇచ్చిన రిపోర్టును తాను బాధితులకు చెప్పానని, అనుమానం రావడంతోనే జిల్లా కేంద్రానికి వెళ్లమని సూచించానని హెడ్ నర్స్ తెలిపింది. మొత్తానికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఆ దంపతులతోపాటు కడుపులో పెరుగుతున్న చిన్ని ప్రాణం కూడా బలయ్యేదే.  

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nalgonda couple  wrong HIV reports  couple commit suicide  

Other Articles