కన్నడనాట ఈ గాడిదల గోల ఏంటో? | deve gowda compare buying MLAs as donkey trading

Deve gowda compare buying mlas as donkey trading

deve gowda, donkey trading, buying MLAs, karnataka politics, karnataka MLC elections, కర్ణాటకలో గాడిదల వ్యాపారం, దేవగౌడ, రాజకీయాలు, తాజా వార్తలు, జాతీయ వార్తలు, రాజకీయాలు, తెలుగు వార్తలు, latest news, telugu news

deve gowda compare buying MLAs as donkey trading. Alleges congress try to buy their MLAs. “How do they expect to win? They take MLAs to Mumbai and for what? You call that horse trading or donkey trading?'' He said the Congress had hit such a low that it needed signed affidavits from its West Bengal MLAs to ensure loyalty.

కన్నడనాట ఈ గాడిదల గోల ఏంటో?

Posted: 06/09/2016 10:56 AM IST
Deve gowda compare buying mlas as donkey trading

రాజ్యసభ బజార్ తోపాటు శాసనమండలి ఎలక్షన్ కోసం కర్ణాటకలో భారీగా ఎమ్మెల్యేల కోనుగోలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పెద్ద మొత్తంలో నగదును ఆశ చూపి కాంగ్రెస్ పార్టీ,  జనతాదళ్ (ఎస్) ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతుందని ఆరోపణలు వినిపస్తున్నాయి. అయితే తామేమీ అభ్యర్థులకు తాయిలాలు ప్రకటించడం లేదని, ఎవరినీ ప్రలోభాలకు గురిచేయడం లేదనీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాగా, ఈ వ్యాఖ్యలపై మాజీ ప్రధాని, జేడీ అధినేత హెచ్.డి.దేవేగౌడ మండిపడ్డారు. ‘ఓటుకు నోటు’ వ్యవహారంపై తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా  కాంగ్రెస్ తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ఇది అభ్యర్థుల కొనుగోలు కాకపోతే మరేంటి, గాడిదల వ్యాపారం జరుగుతోందా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను రాజ్యసభకు గెలిపించుకోగలగుతుంది. ఆ  తర్వాత వారి వద్ద మిగిలిన 33 ఓట్లకు ఇతర స్వతంత్రులను కలుపుకొని మూడో స్థానాన్ని పొందాలని చూస్తున్నారు. ఆ స్వతంత్రుల ఓట్లు వీరు ఎలా సాధిస్తారు, ఇది ప్రలోభాలకు గురిచేయడం కాక మరేంటని పశ్నిస్తున్నారు. ఇదేమన్నా గుర్రాల, గాడిదల వ్యాపారమా? ఇష్టం ఉన్నట్లు కొనుగోలు చేయడానికి అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు.

ప్రస్తుత పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఎన్నికలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ నుంచి ఎన్నో ఫలాలు పొంది ఎదిగిన నేతలు, ఇప్పుడు సొంత పార్టీకే వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారని దేవగౌడ ఆవేదన వ్యక్తంచేశారు. కాగా, రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థుల కొనుగోలుకు సంబంధించి వెలుగుచూసిన స్టింగ్ ఆపరేషనలో జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాజకీయాల్లో అవినీతి సహజమని, ఎమ్మెల్యేలకు ఖర్చులుంటాయని సొంత ఎమ్మెల్యేలను దేవగౌడ వెనుకేసుకొచ్చిన సంగతి తెలిసిందే.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : deve gowda  donkey trading  buying MLAs  karnataka politics  

Other Articles