New districts in TS to come into existence on Dasara

New districts on dasara

new districts, Telangana, reorganizing Hyderabad, reorganizing Rangareddy, KCR, New districts formation, kcr, collectors meeting, Reorganization road map,

Telangana collectors proposed to create 13 additional districts at a conference convened by Chief Minister K. Chandrasekhar Rao

తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ దసరా కానుక

Posted: 06/09/2016 07:24 AM IST
New districts on dasara

తెలంగాణ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా పండుగ కానుకను ఇవ్వనున్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీని రెండేళ్ల తరువాత రానున్న దసరాకు కానుకగా అందించనున్నారు. దసరా పర్వదినాన తెలంగాణలో కొత్త జిల్లాల ఆవిర్భావానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర విభజనకు పూర్వం సమైక్య అంధ్రప్రదేశ్ లో వున్న జిల్లాల సంఖ్యను తెలంగాణలో ఏర్పాటు చేఃయాలిని అందుకనుగూణంగా కొత్త రాష్ట్రంలో జిల్లాలను పెంచనున్నారు.

అందులో భాగాంగానే కొత్త జిల్లాల పునర్విభజనకు రోడ్‌ మ్యాప్‌ను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సమావేశమైన కలెక్టర్ల సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తను పూర్తి చేసింది. అందుకు రోడ్ మ్యాప్ ను కూడా ఖారారు చేసింది. ప్రజాప్రతినిధులు, అఖిల పక్ష నేతలతో సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం దసరా రోజున వాటిని అధికారికంగా ప్రకటించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఈ నెల 20న మరోసారి తెలంగాణ కలెక్టర్లు సమావేశం కానున్నారు. జిల్లాల విభజనపై సమగ్ర నివేదికతో రావాలని సీఎం కేసీఆర్‌ కలెక్టర్లను ఆదేశించినట్టు తెలిసింది.

అదేవిధంగా జూన్‌ 30 లోపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో అభిప్రాయ సేకరణ జరగాలన్నారు. జూలై 5న మరోసారి కలెక్టర్లు సమావేశం కానున్నారు. జూలై 10 లేదా 11న జిల్లాల ఏర్పాటుపై సీఎం నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. జిల్లాల ఏర్పాటుపై ఆగస్టు 4 నుంచి 10 లోపు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. నోటిఫికేషన్‌ వచ్చిన రోజు నుంచి నెలలోపు అభ్యంతరాల స్వీకరణ జరుగనుంది. దాంతో తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్‌ 11 దసరా రోజున కొత్త జిల్లాల ఆవిర్భావం కానుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : new districts  Telangana  reorganizing Hyderabad  reorganizing Rangareddy  KCR  

Other Articles