hunger strike will continue, either at home or in jail says mudragada

Hunger strike untill arrested kapu leaders release says mudragada

kapu reservation stir, kapu garjana, tuni violence, mudragada padmanabham, amalapuram one town police station, Mudragada fast unto death, mudragada hunger strike, NTR,

Kapu caste leader Mudragada padmanbham says he will go for fast unto death, uptill government withdraws cases and release the arrested.

అరెస్టు చేసిన వారిని విడుదల చేసేవరకు దీక్ష: ముద్రగడ

Posted: 06/08/2016 10:02 PM IST
Hunger strike untill arrested kapu leaders release says mudragada

తుని రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు దహనం ఘటనలో అమాయకులపై పెట్టిన కేసులను బేషరుతుగా ఉపసంహరించాలని, అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయాలన్న తమ డిమాండ్లపై ఆ:ధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన వెలువడకపోవడంతో తాను నిరవధిక దీక్ష చేయనున్నట్లు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఉదయం తొమ్మిది గంటలకు తాను ఒక్కడినే దీక్షకు దిగుతున్నానన్నారు. రౌడీషీటరైనా, దోపిడీదారుడైనా, ఖూనీ కోరైనా.. ఆ కేసులు వేరని అన్నారు. కాపు గర్జన సభకు వచ్చిన వారిని అరెస్టు చేసి జైల్లో పెడితే వారిని రక్షించడం తమ బాధ్యతని అయనన్నారు.  

అమరణ దీక్ష నేపథ్యంలో తనను అరెస్ట్‌ చేస్తే జైల్లో పెట్టినా.. అక్కడ కూడా తాను దీక్ష కొనసాగిస్తాను తప్ప బెయిల్‌ తీసుకోననని ముద్రగడ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని ఘటనకు మూల కారకుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఆయన ఆరోపించారు. అరెస్ట్‌ చేసిన వారిని విడుదల చేసేవరకూ తానూ దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. తనను అరెస్టు చేయమనే నిన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని చెప్పుకోచ్చిన ఆయన దీక్ష చేస్తే నన్ను కూడా అరెస్టు చేస్తామని మంత్రులు చెప్పడం విడ్డూరంగా వుందన్నారు.

తనను జైల్లో ఉంచితే కాపు ఉద్యమం నాయకులు లేక ఉద్యమం చల్లారుతుందని ప్రభుత్వం బావిస్తున్నట్లు వుందని, ఉద్యమాన్ని ఎలా నడిపాలి, ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్నది తమ నాయకులు చూసుకుంటారు’ అని అన్నారు. తన దీక్ష వద్దకు వివిధ గ్రామాల నుంచి వచ్చే జనాన్ని ఆపుతారని తెలుసని, ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెడతారని తెలుసని, తనను ఒంటరిని చేయాలని, మీడియా కవరేజ్ లేకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతుందనీ తనకు తెలుసని ముద్రగడ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mudragada padma nabham  chandrababu naidu  kapu leaders  

Other Articles