BSEB results issue: Case registered against Vinshu Rai College director, 3 others

Fir against class 12 arts science toppers in bseb issue

Bihar School Examination Board, BSEB, Vinshu Rai College, Nitish Kumar, bihar toppers, re examination, Case registered, VR college director, FIR on VR collage

A case has been registered against four persons including Director of VR College in connection with alleged irregularities in evaluation of marks in this year's 10+2 examination held by Bihar School Examination Board (BSEB).

బీఎస్ఈబి ఘటనలో.. చిక్కుకున్న ‘ఆ నలుగురు’

Posted: 06/07/2016 09:12 AM IST
Fir against class 12 arts science toppers in bseb issue

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన బిహార్ టాపర్స్ ఘటనలో బీహార్ విద్యాశాఖ అధికారులు నలుగురిపై కేసు నమోదు అయింది. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైశాలిలోని విషుణ్ రే కళాశాల డైరెక్టర్ సహా నలుగురిపై పోలీసులు నమోదు చేశారు. నిన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ఘటనపై వేసిన ప్రత్యక కమిటీని నిర్వీర్యం చేసిన అనంతరం విద్యాశాఖ అధికారులకు నిందితులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారిచేయడంతో వారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ఏమాత్రం అవగాహన కూడా లేకపోవడంతో నివ్వెరపోయిన నితీశ్ సర్కార్ ఈ ఘటనపై దర్యాప్తుకు నియమించిన కమిటీని నిన్న ముఖ్యమంత్రి రద్దు చేసి. ఈ యావత్ ఘటనపై కేసు నమోదు చేయాలని విద్యాశాఖ మంత్రి అశోక్ చౌదరి, ప్రిన్సిపల్ కార్యదర్శ డిఎస్ గంగ్వార్, బీఎస్ఈబీ చైర్మన్ లాల్ ఖేశ్వర్ ప్రసాద్ సింగ్ లతో సమావేశం అనందతరం నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు పరీక్షల నిర్వహించిన అనంతరం వారు ఫెయిలవ్వడంతో వారు చదివిన విన్షు రాయ్ కాలేజ్ డైరెక్టర్ పై కూడా కేసు నమోదు చేశారు. అంతేకాదు కాలేజ్ గుర్తింపును కూడా రద్దు చేశారు.

తాము రాసిన సబ్జెక్టుల గురించి కూడా ఏమాత్రం తెలియకుండా 14మంది టాపర్లుగా నిలిచిన విషయం తెలిసిందే. రాజనీతి శాస్త్రం అంటే వంటలు నేర్పుతారంటూ రూబీ రాయ్ అనే ఓ టాపర్ చెప్పిన వీడియో జాతీయ మీడియాలో హల్‌చల్ సృష్టించింది. పొలిటికల్ సైన్స్ గురించి ఏమాత్రం తెలియని ఆమెకి ఆ సబ్జెక్టులోనే 100కు 91 మార్కులు వచ్చాయి. ఆమెకు మొత్తం 500 మార్కులకు గాను 444 వచ్చినా, అసలు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా తెలియదు. కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉప్పందించిన తర్వాత కూడా.. 600 వచ్చినట్లు ఆమె చెప్పింది.

దీంతో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విభాగాల్లో అగ్రస్థానాల్లో నిలిచిన 14 మందికి జూన్ 3వ తేదీన మరోసారి పరీక్ష నిర్వహించగా వారు అట్టర్ ప్లాప్ అయ్యారు. అయితే ఈ పరీక్షకు ఆరోగ్యం బాగోలేదనే సాకుతో టాపర్ రుబీ రాయ్ డుమ్మా కొట్టింది. అలాగే తనను ప్రశ్నలు అడిగినా, క్రాస్‌ ఎగ్జామిన్‌ చేసినా ఆత్మహత్య చేసుకుంటానని బిహార్‌ సైన్స్ టాపర్‌ సౌరభ్ శ్రేష్ఠ హెచ్చరించాడు. బిహార్‌ ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో సైన్స్ గ్రూప్‌లో టాప్‌ ఐదో ర్యాంకు తెచ్చుకున్న సౌరభ్‌ను 15మంది నిపుణులతో కూడిన ప్యానెల్‌ ఇటీవల ప్రశ్నించింది. రీ-ఎగ్జామినేషన్‌లో టాపర్లు అంతా తేలిపోవడంతో వారి ర్యాంకులు రద్దయ్యాయి. ఆ నేపథ్యంలో ఈ ఘటనపై కేసులు నమోదు చేయాలని నితిష్ ప్రభుత్వం అదేశించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar toppers  re examination  Case registered  VR college director  

Other Articles