సెక్స్ బానిసలుగా మారలేదని చంపేశారు | 19 girls burnt alive for refusing sex slavery

19 girls burnt alive for refusing sex slavery

ISIS, sex slavery, 19 girls kill, Iraq, తాజా వార్తలు, సెక్స్ బానిసలు, ఇరాక్, ఐఎస్ఐఎస్, ఉగ్రవాదులు, తెలుగు వార్తలు, latest news

19 girls burnt alive for refusing sex slavery. Iraq mosool town infront of parents.

సెక్స్ బానిసలుగా మారలేదని చంపేశారు

Posted: 06/07/2016 10:42 AM IST
19 girls burnt alive for refusing sex slavery

ఉగ్ర రాక్షస మూక ఐఎస్ఐఎస్ మరోసారి వార్తల్లో నిలిచింది. చిన్నపిల్లలు, మహిళలలు అని చూడకుండా వారిపై దారుణాలకు తెగపడుతున్న వీరు తాజాగా మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇప్పటికే వేల మంది యువతులను సెక్స్ బానిసలుగా మార్చుకుంటున్న తీవ్రవాదులు, ఆపై వారిని ధనవంతులకు అమ్మేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమ కోరిక తీర్చలేదంటూ బాలికలను అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన ఇప్పుడు వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్లితే.. ఇరాక్ లోని ఐఎస్ఐఎస్ అధీనంలో ఉన్న మోసూల్‌ పట్టణంలో వందల మంది యువతులను ఒక చోట చేర్చారు. సెక్స్ బానిసలను వేలం వేసే ప్రాంతంలో వీరందరినీ లైంగికంగా లొంగిపోవాలని ఆదేశించారు. అందుకు వారంతా నిరాకరించడంతో కోపోద్రిక్తులయ్యారు. వారందరినీ ఓ ఇనుప చట్రంలో బంధించి, పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. పట్టపడలు నడిరోడ్డుపై ఇంత జరుగుతున్నా ఎవరూ అడ్డుకోలేదు. తల్లిదండ్రుల ఎదుటే వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, ఆ యువతుల హాహాకారాలు మిన్నంటాయని కుర్దిష్ కు చెందిన ఓ వార్తా పత్రిక తెలిపింది. కాగా, 2014 నుంచి ఇప్పటిదాకా ఒక్క ఇరాక్ లోని 3,000 మందిని సెక్స్ బానిసలుగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  sex slavery  19 girls kill  Iraq  

Other Articles