ఫేక్ అకౌంట్ తో ప్రొఫెసర్ బూతుపాఠాలు | kakinada Professor creat fake FB account and harrasing girls

Kakinada professor creat fake fb account and harrasing girls

kakinada Professor, fake facebok account, professor sex chat, professor forcing student, FB sex chat, తాజావార్తలు, ఏపీ న్యూస్, తెలుగు వార్తలు, కాకినాడ ప్రొఫెసర్, ఫేస్ బుక్ ఫేక్ అకౌంట్ బూతు చాటింగ్, ఫేక్ అకౌంట్ తో వేధింపులు, latest news, telugu news

kakinada Professor creat fake FB account and harrasing girls. forcing for sex chat and arrested.

ఫేక్ అకౌంట్ తో ప్రొఫెసర్ బూతుపాఠాలు

Posted: 06/06/2016 05:26 PM IST
Kakinada professor creat fake fb account and harrasing girls

గౌరవనీయ టీచర్ వృత్తిలో ఉన్న అతనికి ఓ పిచ్చి ఆలోచన వచ్చింది. సామాజిక మాధ్యమాన్ని వినియోగించుకుని అశ్లీల కార్యకలాపాలకు పాల్పడ్డాడు. పేస్ బుక్ లో ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అమ్మాయిలందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపాడు. ముందు మంచిగా స్నేహం పెంచుకుని ఆపై సెక్స్ చాట్ చేయాలని కోరడం. బూతు ఫోటోలు, కామెంట్లు పెట్టి అమ్మాయిలను వేధించడం చేశాడు. చివరికి ఖాకీలు రంగ ప్రవేశం చేయడంతో ఆ ప్రొఫెసర్ వికృత చేష్టలు బయటపడ్డాయి.

కాకినాడలో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్ మెంట్ శిక్షణ ఇచ్చే అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు కారాని నరేష్. ఫేస్ బుక్ లో ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి కనిపించిన వారికల్లా రిక్వెస్ట్ లు పంపాడు. ఆపై అర్థరాత్రి ఆ అమ్మాయిలతో చాట్ చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో మాములుగానే కొనసాగిన ఆపై రాను రాను అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నగ్న చిత్రాలు పంపడంతోపాటు అమ్మాయిలను నగ్నంగా వీడియో చాట్ చేయాలని కోరేవాడంట. అతని ఆగడాలు శృతిమించడంతో పెనుగొండకు చెందిన ఓ యువతి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. దీంతో వారు రంగంలోకి దిగి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అతను టార్గెట్ చేసిన అమ్మాయిల్లో ఎక్కువ మంది అతగాడి స్టూడెంట్సే ఉన్నారని తెలుస్తోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles