పవర్ కట్ లో భారత్ సరికొత్త రికార్డు | 2016-17 creats record with no power cuts in india

2016 17 creats record with no power cuts in india

no power cut year, india, 2016-17 power cut, india powercut, modi govt power cuts, జాతీయ వార్తలు, కరెంట్ కోతలు లేని ఏడాది, 2016-17 పవర్ కట్ లేని ఏడాది, తెలుగువార్తలు, latest news, telugu varthalu

In Indian history for the first time declared that it will not have a power deficit this year. A situation officials say is an outcome of the current government's initiatives to resolve burning issues like fuel scarcity. The country will have a surplus of 3.1% during peak hours and 1.1% during non-peak hours during 2016-17, latest data from the Central Electricity Authority shows.

పవర్ కట్ లో భారత్ సరికొత్త రికార్డు

Posted: 06/06/2016 05:35 PM IST
2016 17 creats record with no power cuts in india

పవర్ కట్ లేని రాష్ట్రంగా తెలంగాణ ను తీర్చిదిద్దుతానని కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసే సమయంలో అదంతా అయ్యే పనేనా నుదుటితో వెక్కిరించిన వారు చాలా మందే ఉన్నారు. కానీ, ఆయన మాత్రం ఆ అనుమానాలను పటాఫంచల్ చేసేశారు. ఈ యేడాది ఇప్పటికే కోతలు గణనీయంగా తగ్గించిన సర్కార్ కి ఈయేడు వర్షాలు విపరీతంగా ఉంటాయనే సూచనతోపాటు, నీటి ఆధారిత ప్రాజెక్టుల రూపకల్పనలో ఇప్పటికే అడుగు పడటం కలిసొచ్చే అంశాలు. వెరసి రాబోయే రోజుల్లో కోతలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే తెలంగాణ విషయం ఏమోగానీ ఈ యేడాది విద్యుత్ కోతల విషయంలో దేశ చరిత్రలోనే నిలిచిపోనుంది.  

దశాబ్దంగా ఎన్నడూ లేనంతగా ఈ యేడాది మన దేశంలో విద్యుత్ కోతలు లేకుండా ఉన్నాయంట. పీక్ అవర్స్(అత్యవసరం సమయంలో) లో సైతం 3.1 శాతం అదనపు విద్యుత్ ను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర విద్యుత్ అధారిటీ సంకేతాలు పంపింది.  భారత్ లో విద్యుత్ కొరత లేకుండా, మిగులు విద్యుత్ నమోదు కావడం ఇదే తొలిసారి. 2015-16లో పీక్ అవర్ లో 3.2 శాతం కొరత నమోదైనట్లు, కానీ, ఈ సంవత్సరం దాన్ని అధిగమించినట్లు అధికారులు చెబతున్నారు. బొగ్గు లభ్యత అధికంగా ఉండటంతో థర్మల్ పవర్ ప్లాంట్ల ఉత్పత్తి ద్వారా పెరిగిందని. అంతేగాక పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని అందించడం తద్వారా అన్ని రాష్ట్రల సహకారంతో ఈ ఫీటు సాధ్యమయిందని వారంటున్నారు.

కాగా,  ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తరువాత విద్యుత్ మిగులు నమోదు కావడం మోదీ టీమ్ సాధించిన పెద్ద ఘనతగా విద్యుత్ రంగ నిపుణులు వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా సగటున మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ, కొన్ని రీజియన్లలో మాత్రం విద్యుత్ కోతలు కొనసాగించాల్సి వస్తోందని అధికారులు వివరించారు. కాగా, ఇదేమీ ఎన్డీయే ఘనత కాదని, తాము తీసుకున్న చర్యల ఫలితమే నేడు విద్యుత్ మిగులుకు కారణమని కాంగ్రెస్ నేత, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా వ్యాఖ్యానించాడు. కారణం ఎవరైతేనేం మొత్తానికి అధికారికంగా 2016-17 విద్యుత్ కోతలు లేని సంవత్సరంగా చరిత్రలో నిలవనుంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : no power cut year  india  2016-17 power cut  india powercut  

Other Articles