కాసుల కోసం కక్కుర్తిపడ్డ ఓ ప్రైవేట్ ఆస్పత్రి చేసిన నిర్వాకంతో నిఖిల్ రెడ్డి అనే యువకుడు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో మనందరికీ తెలుసు. పొడవు పెరిగేందుకు తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా రెండు నెలల క్రితం ఆ యువకుడు హైదరాబాదులోని గ్లోబల్ ఆస్పత్రిలో కాళ్లకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అయితే అలాంటిది సాధ్యం కాదని తెలిసి కూడా సర్జరీ పేరుతో ఆ యువకుడి జీవితాన్ని నాశనం చేసింది. రెండు కాళ్ల మధ్య రాడ్లలాంటివి అమర్చి కనీసం అతన్ని నడవలేని స్టేజీకి దిగజార్చింది. దీంతో హీరో నితిన్ లా మారదామనుకుని కలలు కన్న ఆ యువకుడు ఉద్యోగం కోల్పోవటంతోపాటు పూర్తిగా వీల్ చైర్ కే అంకితమయిపోయాడు. విషయం మీడియా దృష్టికి చేరటంతో రెండు నెలల్లో బాగుచేస్తామంటూ హామీ ఇచ్చిన ఆస్పత్రి యాజమాన్యం ఆపై కిక్కురుమనకుండా ఉండిపోయింది. దీనిపై యువకుడి తండ్రి న్యాయ పోరాటానికి సిద్ధమవగా, చివరికి ఈ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వం దృష్టికి చేరింది.
దీనిపై పూర్తి విచారణ చేపట్టిన తెలంగా మెడికల్ కౌన్సిల్ సోమవారం పూర్తి నివేదికను వెలువరించింది. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఆపరేషన్ నిర్వహించారని అందులో పేర్కొంది. ఆపరేషన్ చేసిన వైద్యులపై చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రైవేట్ ఆస్పత్రుల మీద ఓ కన్నేసి ఉంచుతామని తెలిపింది. ఒకవేళ ఎవరైనా ఇలాంటి శస్త్రచికిత్సలకు పాల్పడితే ప్రభుత్వానికి సిఫారసు చేసి వాటిని మూయించేస్తామని హెచ్చరించింది. ప్రస్తుతం నిఖిల్ రెడ్డి పరిస్థితిని అతని తండ్రి ద్వారా సమీక్షిస్తున్నామని తెలిపింది. అవసరమైతే అతన్ని ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరతామని టీఎంసీ ప్రకటించింది. ఇక పూర్తి నివేదికను పరిశీలించి, సంబంధిత మంత్రిత్వ శాఖతో సంప్రదించాకే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Jun 25 | ‘పుష్ప’ సినిమాతో పాటు ఇప్పటికే పలు సినిమాల్లోనూ పోలీసుల కళ్లు గప్పి అక్రమార్గాలల్లో ఎలా సరుకు రవాణా చేయాలో అన్నది ఒక్కో దర్శకుడు ఒక్కో వినూత్న మార్గాన్ని చూపించారు. అయితే ఆ మార్గాలను అన్వయించుకుని,... Read more
Jun 25 | పామును తేలిగ్గా పట్టుకోవచ్చునని అనుకుంటారు కొందరు. స్నేక్ ఫ్ఱెండ్స్ లేదా స్నేక్ క్యాచర్స్ పాములను పట్టుకోవడం చూసి ఓస్ ఇంతేనా.. అని అనుకునేవారు.. తామేం తక్కువ అని ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వాటిని పట్టుకోవడం... Read more
Jun 25 | తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆస్తులపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని కొందరు ఉద్యోగులు తమ విధులకుహాజరుకాకుండా.. ఆయా స్థానాల్లో ఎవరో ఒకర్ని తమలా నటింపజేస్తూ.. వారు మాత్రం తమ... Read more
Jun 25 | విధి అడే వింత నాటకంలో అందరం పావులమే. అయితే.. ఎవరి ఆట ఎప్పుడు ఆరంభమవుతుందో ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కానీ ఇది ముమ్మాటికీ నిజమని ఎవరైనా చెబితే ‘వేదాంతం’ మాట్లాడుతున్నారని కొట్టిపారేస్తాం. అయితే నిజమని... Read more
Jun 25 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ అటు శివసేన పార్టీ అనుకూల, ప్రతికూల వర్గాలతో పార్టీ నిట్టనీలువునా రెండుగా చీలిపోతోంది. ఇంతకాలం శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే అంటే మహారాష్ట్రవాసుల్లో ఉన్న భక్తి, అయన... Read more