why media and social media are targeting me asks Hema malini

Hema malini hits back at critics after mathura clashes

mathura, hema malini, mathura clashes, mathura violences, hema malini mathura, mathura mp hema malini, hema malini shooting photos, mathura calshes, hema shooting photos, mathura killings, mathura sp death, mathura sho death, up mathura clashes, up govt mathura clashes,

BJP MP Hema Malini, said that instead of reporting the violence and exposing the people responsible for the unfortunate incidents, “they have begun targeting me and discussing my work in the constituency.”

నేనేమి చేశాను నేరం..ననెక్కడంటింది పాపం..

Posted: 06/06/2016 02:56 PM IST
Hema malini hits back at critics after mathura clashes

మథుర అల్లర్ల విషయంలో తనను మీడియా, సోషల్ మీడియా కావాలని టార్గెట్ చేస్తున్నాయని బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమ మాలిని అన్నారు. తానేదో నేరం చేసినట్లుగా మీడియా చిత్రీకరించడం, ఏ పాపం తెలియని తనను సోషల్ మీడియా ఏకిపారేయడంపై అమె అగ్రహం వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను అనవసరంగా రాద్ధాంతం చేయడమే పనిగా మీడియా పెట్టుకుందని అమె మండిపడ్డారు. మీడియాతో సహా ప్రతి ఒక్కరూ ఎలాంటి నిజనిజాలు తెలుసుకోకుండా తన చిత్తశుద్ధిని శంకిస్తున్నారని అరోపించారు.

తనను కావాలని టార్గెట్ చేసుకున్నారన్నారు. ఘర్షణలకు సంబంధించిన సమాచారం అందగానే వెళ్లి అధికారులను కలిశానన్నారు. అలాగే, బాధితులను కూడా పరామర్శించాను. అక్రమంగా కొందరు వ్యక్తులు స్వాధీనం చేసుకున్న క్వార్టర్స్ విషయంలో చర్యలు తీసుకోవాలని తానే రెండు నెలల కిందట మధుర జిల్లా మెజిస్ట్రేట్ రాజేశ్ కుమార్ను కలిసి చెప్పానన్నారు. ఈ విషయంలో ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు విఫలమైనట్లే. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టమని ఆమె చెప్పారు.

అసలు ఘర్షణలకు కారమైన అఖలేష్ ప్రభుత్వాని వదిలేని తనపై ఎందుకు అక్కస్సు వెళ్లగక్కుతున్నారో అర్థం కావడం లేదన్నారు. తన పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతున్న హింసను, బాధిత ప్రజల గురించి సమాచారం అందజేయకుండా వాళ్లు(మీడియా-సోషల్ మీడియా) తనను టార్గెట్ చేసుకున్నారని విమర్శించారు. మీడియా ఇలాంటి ఘటనల వెనుక నిజనిజాలు కచ్చితంగా తెలుసుకోవాలని, కానీ, అలా తెలుసుకునే ప్రయత్నం చేయకుండా తనను టార్గెట్ చేయడం సబబుకాదన్నారు. తాను మథుర, బృందావనంకోసం ఎంతో పనిచేస్తున్నానని, అక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నానని చెప్పారు.

అయితే మథురలో అక్రమ కట్టడాలను తొలగించే విషయంలో తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగి ఒక ఎస్పీ స్థాయి అధికారి సహా ఇద్దరు పోలీసులతో పాటు 21 మంది మరణించారు. అయితే, సరిగ్గా ఇదే సమయంలో ఒక సినిమా షూటింగులో పాల్గొంటున్న మథుర బీజేపీ ఎంపీ హేమమాలిని.. ఆ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు. ఒక లాంచీ ఎక్కుతున్న ఫొటోలు మూడింటిని ఆమె ట్వీట్ చేశారు. దాంతో వెంటనే ట్విట్టర్ విమర్శలతో మోతెక్కిపోయింది. మథుర కాలిపోతుంటే ఎంపీ మాత్రం సంబరాలు జరుపుకుంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. బహుశా అందుకనే కాబోలు అమెను మీడియా, సోషల్ మీడియా టార్గెట్ చేసింది.

మనోహర్

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hema malini  mathura mp  Jawahar Bagh clash  uttar pradesh  

Other Articles