విసిగించడంలో మాత్రం సక్సెస్ అయ్యాడంట! | chandrababu head ache with jagan abusive statements

Chandrababu head ache with jagan abusive statements

AP CM chandra babu, YSRCP, jagan, jagan abusive words, jagan headache to babu, babu on slipper slap comments, జగన్ వ్యాఖ్యలపై బాబు స్పందన, వైఎస్సార్సీపీ, చంద్రబాబు, చెప్పు కామెంట్లు, జగన్, చీపురు కామెంట్లు, తెలుగు వార్తలు, ఏపీ రాజకీయాలు, latest news, telugu news

chandrababu head ache with jagan abusive statements. chandrababu says head ache with jagan wordss. irritated with opposition leader speeches.

విసిగించడంలో మాత్రం సక్సెస్ అయ్యాడంట!

Posted: 06/06/2016 01:37 PM IST
Chandrababu head ache with jagan abusive statements

ఓవైపు ప్రతిపక్ష నేతగా పూర్తిగా విఫలమవుతున్నాడంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో అనవసరమైన మాటలతో నోరు జారి ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నాడు ప్రతిపక్ష నేత జగన్. సీఎంను చెప్పులు, చీపుర్లతో కొట్టాలడం దారుణమంటూ అన్ని పార్టీలు జగన్ పై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇలాంటి నీచపు మాటలు మాట్లాడకుండా మహిళలు జగన్‌కు గంటెలతో వాతలు పెట్టాలని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కోరుతున్నారు. అయితే ఇంత పరుషమైన పదజాలం వాడుతున్న అవేం పట్టించుకోకుండా అభివృద్ధి పనుల్లో నిమగ్నైపోయారు సీఎం చంద్రబాబు. కానీ, ఆదివారం విజయవాడలో జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ లాంటి వాడు గ్రామానికి ఒకడుంటే దేశం సర్వనాశనమైపోద్దంటూ ఘాటైన పదజాలం వాడారు. ఇక సోమవారం అదే రీతిలో మరోసారి స్పందించారు.

అమరావతి పనుల సమీక్షకు వచ్చిన ఆయన్ని మీడియా ఈ వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా ఈసారి కాస్త ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ అనుభవమంత వయసు లేని జగన్ తనకు పెను సమస్యగా, పెద్ద తలనొప్పిగా పరిణమించారంటూ స్పందించారు.  ‘‘సీఎం పదవిలో ఉన్న వ్యక్తికే జగన్ సవాల్ విసురుతాడా? జగన్ వయసు నా రాజకీయ అనుభవమంత లేదు. రాజకీయాల్లో హుందాతనం అవసరం. వైఎస్ సహా ఎంతోమందిని చూశా. కానీ జగన్ కారణంగా ఎదురవుతున్న సమస్యలు నాకు ఎప్పుడు ఎదురు కాలేదు’’ అని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలను జగన్ విజ్ణతకే వదిలేస్తున్నానంటూ తెలిపారు. నోటికొచ్చినట్లు మాట్లాడమే రాజకీయమనకుంటే పొరపాటు, ప్రజలు అంతా చూస్తున్నారు. సమయం దొరికినప్పుడు వాళ్లే తగిన బుద్ధి చెప్తారంటూ తెలిపారు. రాజకీయాల పరంగా ప్రభుత్వాన్ని ఏరకంగానూ ఇబ్బందిపెట్టని జగన్ వ్యక్తిగత విమర్శలతో మాత్రం చంద్రబాబుకి పెద్ద తలనొప్పిగా తయారయ్యాడన్న మాట.   

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP CM chandra babu  YSRCP  jagan  

Other Articles