sister friend raped and threatened in east godavari

Minor girl raped by friends brother in east godavari

Rape, tadepalli vara prasad, sister's friend, social media, threat, warning, east godavari, jonnada, alumooru, rape on minor girls, rape filmed, rape video, socail media, death threat of family members, molestation on girls, harrassment on girls,

A Girl who went for her friend was raped by friends brother vara prasad in jonnada village of alamooru mandal, east godavari district of Andhra pradesh.

చెల్లెలి స్నేహితురాలిపై మగమృగం అత్యాచారం.. బెదిరింపులు..

Posted: 06/05/2016 09:41 AM IST
Minor girl raped by friends brother in east godavari

చెల్లెలి కోసం ఇంటికి వచ్చిన ఆమె స్నేహితురాలిపై ఓ మగమృగం తెగబడి కామవాంఛను తీర్చుకుంది, ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. చెల్లెలి స్నేహితురాలని కూడా చెల్లిగానే పరిగణించి చూసే సంస్కృతి మనది. అలాంటి చెల్లి స్నేహితురాలిపై తెగబడిన ఓ పైశాచిక మృగం.. అమెపై అత్యారానికి తెగబడటంతో పాటు.. విషయాన్ని బయటకు చెబితే అత్యాచార వీడియోను సోషల్ మీడియాలో పెడతానని కూడా బెదిరించాడు. అంతేకాకుండా ఆ బాలిక కుటుంబ సభ్యులను చంపేస్తానిని బెదిరింపులకు దిగాడు.

ఈ ఘటన జిల్లాలోని తూర్పు గోదావరి జల్లాలోని ఆలమూరు మండలం జొన్నాడలో వెలుగు చూసింది. పోలీసులు వెలువరించిన వివరాల ప్రకారం.. స్థానిక ఎస్సీ పేటకు చెందిన 17 ఏళ్ల బాలిక గత నెల 9న స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఆమె సోదరుడు తాడేపల్లి వరప్రసాద్(19)ను ‘మీ చెల్లెలు ఎక్కడుంది’ అని అడిగింది. గదిలో ఉందని చెప్పడంతో బాలిక గదిలోకి వెళ్లగానే తలుపు గడియ పెట్టి కత్తితో బెదిరించి ఆమె పై లైంగిక దాడి చేశాడు.

ఆ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించానని, విషయం బయటకు చెప్తే సోషల్‌మీడియాలో పెట్టి పరువు తీస్తానని బెదిరించాడు. అంతేకాక బాలిక కుటుంబ సభ్యులను సైతం చంపుతానని హెచ్చరించాడు. దాంతో ఆ బాలిక జరిగిన ఘాతుకం గురించి ఎవరికీ చెప్పలేదు. కాగా వరప్రసాద్ స్నేహితుల మొబైల్ ఫోన్లలో లైంగికదాడికి సంబంధించిన దృశ్యాలు స్థానికుల కంటబడ్డాయి. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి కుమార్తెను నిలదీయగా.. జరిగిన దారుణం గురించి చెప్పింది. దీంతో ఆయన శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు వరప్రసాద్ పరారీలో ఉన్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rape  tadepalli vara prasad  sister's friend  social media  threat  warning  east godavari  jonnada  alumooru  crime  

Other Articles