Hillary Clinton supporters enjoying jabs at Donald Trump

Hillary clinton wins virgin islands democratic caucuses

Hillary Clinton, Virgin Islands, celebrations, democratic party, Bernie Sanders, donald trump, republican, US presidential race,

Hillary Clinton has won the Virgin Islands Democratic caucuses, according to results provided by the local Democratic Party

సంబరాల్లో మునిగితేలుతున్న అమె మద్దతుదారులు..

Posted: 06/05/2016 10:43 AM IST
Hillary clinton wins virgin islands democratic caucuses

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా దూసుకుపోతున్న డోనాల్డ్ ట్రప్ కు ప్రత్యర్థిగా బలమైన పోటీని ఇచ్చేందుకు డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటనే నిలవనున్నారు. నిన్నమొన్నటి వరకు ఈ పదవికి డెమొక్రట్ల తరపున అనుభవశైలైన సాండర్స్ బరిలో నిలువగా.. అయనను వెనక్కి నెట్టి డెమొక్రటిక్ పార్టీ తరుపున దాదాపు నామినేషన్ ఖరారు చేసుకోనున్నారు హిల్లరి. తాజాగా అమెరికాలోని పలు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో అమ సాండర్స్ పై పేచేయి సాధించారు.

వర్జిన్ ఐలాండ్లోని నగరాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థుల్లో హిల్లరీనే పై చేయి సాధించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎవరెవరు ఎన్నిస్థానాల్లో పై చేయి సాధించారనే విషయం స్పష్టంగా తెలియకున్నా ఆరు చోట్ల మాత్రం హిల్లరీదే పై చేయి అని చెబుతున్నారు. పోటీలో ఉన్న సాండర్స్ను ఆమె అధిగమించారని.. డెమొక్రటిక్ తరుపున నామినేషన్ వేసే అర్హతకు చేరువలో ఉన్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో తాను అప్పుడే విజయం సాధించినంత సంబరాల్లో హిల్లరీ మునిగిపోయారంట. అమె కాదు అమె అభిమానుల సంబరాలకు కూడా హద్దు లేకుండా పోయిందట.

ఫేస్ బుక్ ద్వారా డెమొక్రటిక్ పార్టీ వెల్లడించిన ఫలితాల్లో వర్జిన్ ఐలాండ్ లోని పెద్ద దీవులైన సెయింట్ క్రాయిక్స్, సెయింట్ థామస్ లో ఆమె పై చేయి సాధించినట్లు స్పష్టం అయింది. మరు నాలుగు చోట్ల కూడా ఆమెనె విజయం వరించిందని చెబుతున్నారు. సెయింట్ క్రాయిక్స్ లో 92శాతం ఓట్లు ఆమెకు రాగా, సెయింట్ థామస్ లో 88 శాతం ఓట్లు వచ్చాయి. కాగా, జూలై నెల వరకు ఎవరు డెమొక్రటిక్ అభ్యర్థిగా వెళతారు ఎదురు చూడాల్సిందే తప్ప ఇప్పుడే ఆఖరు అనుకోవద్దని సాండర్స్ చెప్పాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles