అక్కడి టాపర్ల సమాధానాలు పిచ్చెక్కిస్తాయి | Bihar State Toppers to Reappear in Their Board Exams

Bihar state toppers to reappear in their board exams

Bihar State Toppers, reexam, Inter board exam, బీహార్ వార్తలు, :ఇంటర్ పరీక్షలు, రీ ఎగ్జామ్, latest news, telugu news, political news

Bihar State Toppers to Reappear in Their Board Exams.

అక్కడి టాపర్ల సమాధానాలు పిచ్చెక్కిస్తాయి

Posted: 06/02/2016 12:29 PM IST
Bihar state toppers to reappear in their board exams

పండిత పుత్ర పరమ సుంఠ అనే నానుడి ఒకటి ఉంది. అయితే తల్చుకుంటే అలాంటి జీరోలను కూడా రాత్రికి రాత్రి హీరోలను చేసేయొచ్చు. అధికారుల నిర్లక్ష్యమో లేక ఉపాధ్యాయుల కర్మో తెలీదుకానీ ఓ పరీక్షలో టాపర్లుగా నిలిచిన కొందరు తమ విచిత్రమైన సమాధానాలతో షాకుల మీద షాకులు ఇస్తున్నారు. తాజాగా బీహార్ లో నిర్వహించిన ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో 14 మంది టాపర్లకు మరోసారి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకో అసలు కారణం తెలిస్తే మీరూ నవ్వుకుంటారు.

పొలిటికల్ సైన్స్ విభాగంలో రూబీ 88.88శాతంతో టాపర్ గా నిలిచింది. అసలు తనకు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా ఆమెకు తెలిదంట. పొలిటికల్ సైన్స్ ను ప్రొడిగల్ సైన్స్ గా ఆమె ఉచ్ఛరించింది. ఇక అందులో ఏంముంటాయో చెప్పంటే అది వంటకు చెందిన శాస్త్రమని అనుమానమట. చివర్లో కంగారుగా పరీక్షలో 500 మార్కులు ఉంటే తనకు 600 వచ్చినట్టు చెప్పడం మరీ టూమచ్. ఇక సైన్స్ టాపర్ సౌరవ్ రాయ్ మరో విచిత్రమైన కథ. అసలు అతనికి సోడియం, ఎలక్ట్రాన్ అంటే ఏంటో కూడా తెలీదంట. ఇదంతా మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీంతో స్వయంగా నితీశ్ కుమార్ రంగంలోకి దిగారు.  వాళ్లంతా నిజంగానే తమతమ సబ్జెక్టుల్లో టాపర్లు అయ్యే అర్హతను కలిగివున్నారా? అన్నది తేల్చేందుకు ఈ పరీక్షను నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఒకే కళాశాలలో చదివిన వీరికి అత్యధిక మార్కులు రావడంపై విమర్శలు వెల్లువెత్తడంతో పాటు, జోకులు కూడా పేలుతుండడంతో వీరికి మళ్లీ ఓ పరీక్ష, ఇంటర్వ్యూ పెట్టనున్నట్లు బీఎస్ఈబీ చైర్మన్ లల్కేశ్వర్ ప్రసాద్ సింగ్ వెల్లడించారు. ఒకవేళ వీళ్లు ఇందులో గనక ఫేలయితే మాత్రం వాళ్ల పేపర్లు దిద్దిన అధ్యాపకులతోపాటు ఇన్విజిలేటర్లపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా, 14 మంది విద్యార్థుల్లో 10 మంది అధ్యాపక కుటంబానికి చెందిన వారే ఉండటం గమనార్హం.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar State Toppers  reexam  Inter board exam  telugu news  

Other Articles