కట్టుబట్టలతో బయటికి నెట్టారు | chandrababu full speech at Nava Nirmana Deeksha

Chandrababu full speech at nava nirmana deeksha

AP CM chandrababu, Nava Nirmana Deeksha, vijayawada, నవనిర్మాణ దీక్ష, విజయవాడ, చంద్రబాబునాయుడు, తాజా వార్తలు, ఆంధ్రప్రదేశ్ వార్తలు, తెలుగు వార్తలు, telugu news, politics

AP CM chandrababu full speech at Nava Nirmana Deeksha.

కట్టుబట్టలతో బయటికి నెట్టారు

Posted: 06/02/2016 12:25 PM IST
Chandrababu full speech at nava nirmana deeksha

ఓవైపు తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు ఆకాశాన్ని అంటుతుంటే... సాటి తెలుగు రాష్ట్రంలో మాత్రం నిరసనల పర్వం కొనసాగుతుంది. జూన్ 2 తెలుగు జాతి చరిత్రలో ఓ చీకటి దినమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నాడు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చేయడాన్ని ప్రశ్నిస్తూ విజయవాడలో నవనిర్మాణ దీక్షను ఆయన ప్రారంభించారు. ముందుగా ప్రజలతో ప్రతిజ్ణ చేయించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాలను ఏకరువు పెట్టారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన విభజనను ఆపలేకపోయాం. రహస్యంగా రాష్ట్రాన్ని విభజించారు. బలవంతంగా పార్లమెంట్ తలుపులు మూసేసి బిల్లు పాస్ చేశారు. సమస్యలు చెబుతుంటే అస్సలు పట్టించుకోలేదు. కట్టుబట్టలతో, నెత్తిన అప్పుతో పొరుగు రాష్ట్రం నుంచి వెల్లగొట్టారు. ఆదాయం లేదు. పార్లమెంట్ లో ఎంపీలు రెండేళ్లు గళం విప్పుతున్నా ప్రయోజనం లేకపోతుంది. కష్టపడి అభివృద్ధి చేస్తే అప్పులే మిగిలాయి. కష్టాలు చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. భవిష్యత్తులో రాబోయే సమస్యల గురించి అప్పుడే యూపీఏ ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష బీజేపీని హెచ్చరించాను. కానీ, అవేవీ వారు పట్టించుకోలేదు. ఫలితం నేడు ఎలాంటి ఆధారంలేని ఆంధ్రప్రదేశ్ మిగిలింది. అయినా చెక్కుచెదరాల్సిన అవసరం లేదని, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి చెంది తీరుతుందని ఆయన చెప్పారు. అన్యాయాలు జరిగాయి, అవమానాలు జరిగాయి అవన్నీ భరించాం. రాష్ట్రాన్ని విడగొట్టిన వారికి అసూయ, ఈర్ష్య క‌లిగేలా రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌రిచి చూపిద్దామ‌ని ప్రజలకు పిలుపునిచ్చారు. వేడుకలు చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదని, రాష్ట్రపురోగతికి ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉందంటూ ప్రసంగించారు.

అంతకు ముందు రాష్ట్ర సలహాదారు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ...  రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించే నాయ‌క‌త్వం మ‌న‌కు దొరికింది, మంచి ప్రభుత్వం మ‌న‌కు దొరికింది’ అని అన్నారు. ‘అన్యాయాన్ని నెమ‌రు వేసుకుందాం, అవ‌కాశాల‌ను ఆలోచిద్దాం’ అంటూ చెప్పారు. ‘ఒక సంక‌ల్పాన్ని తీసుకుందాం, రాష్ట్రాన్ని ముందుకు న‌డిపించేందుకు ప్ర‌తిజ్ఞ చేద్దాం’ అని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. కేంద్రం పట్టించుకోకపోయినా బాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని సమస్యలను అధిగమిస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు.

భాస్కర్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP CM chandrababu  Nava Nirmana Deeksha  vijayawada  telugu news  

Other Articles