తెలంగాణ చీకట్లు తొలగిపోయాయి | KCR speech at telangana two years celebrations

Kcr speech at telangana two years celebrations

telangana CM, KCR, two years celebrations, parade ground, తెలంగాణ, రాష్ట్ర అవతరణ దినోత్సవం, రెండేళ్లు, పెరేడ్ గ్రౌండ్, కేసీఆర్, latest news, telangana news, telugu news

KCR full speech at telangana two years celebrations at parade ground.

తెలంగాణ చీకట్లు తొలగిపోయాయి

Posted: 06/02/2016 01:22 PM IST
Kcr speech at telangana two years celebrations

ఆంధ్ర పాలనలో పైసా అడుక్కునే పరిస్థితిలో ఉండేవాళ్లం. అసలు రూపాయి కూడా ఇవ్వం ఏం చేసుకుంటారో చేస్కోండి అని బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు సొంతంగా మన నిధులు మనమే ఖర్చు చేసుకుంటున్నాం ఇది రెండేళ్లలో మన రాష్ట్రం సాధించిన ప్రగతి అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముందుగా గన్ పార్క్ వద్ద మంత్రులతో కలిసి అమర వీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించారు. అటు నుంచి లుంబినిపార్క్ లో అమరుల మెమోరియల్ కు శంకుస్థాపన చేశారు. తర్వాత సంజీవయ్య పార్కులో దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆపై సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అవతరణ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

తొలుత తెలంగాణ రాష్ట్ర అవతరోణత్సవం సందర్భంగా ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో ద్విత్వియ శ్రేణి పౌరులుగా బతికాం. నీళ్లు, నియామకాలు, నిధులే లక్ష్యంగా ఉద్యమాన్ని సాగించి, రాష్ట్రాన్ని సాధించుకోగలిగాం. సమైక్య పాలనలో అవమానాలు ఎదుర్కున్నాం. తెలంగాణ ప్రజలు ఆకలి చావులకు గురయ్యారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఆర్థిక స్థితి మెరుగుపడింది. మేనిఫెస్టో వాగ్ధానాలను అమలు చేస్తూ ఈ రెండేళ్లలో గణనీయంగా అభివృద్ధి సాధించాం. ప్రజల అవసరాలను బట్టి  మేనిఫేస్టోలో కొన్నింటిని ప్రత్యేకంగా అమలు చేస్తున్నాం. విద్యుత్ సమస్యను త్వరగా అధిగమించాం. మిషన్ భగీరథ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిలవటం తమ ప్రభుత్వం సాధించిన పెద్ద విజయం’’ అని పేర్కొన్నారు. రైతన్నకు, విద్యార్థులకు, మహిళలకు, ఏ ఒక్కరినీ వదలకుండా తమ ప్రభుత్వం అందరి భాగోగుల కోసం కృషి చేస్తుందని ప్రకటించారు. ఈ సందర్బంగా రెండేళ్లలో చేపట్టిన పలు అభివృద్ధి పథకాలు, అవి సాధించిన విజయాలను ఆయన వివరించారు. అంతేకాదు భవిష్యత్తులో చేపట్టబోయే మరి కొన్నింటిని ఆయన ప్రకటించారు.

- హైదరాబాద్ లో మరో 3 లేదా 4 ఆస్పత్రులు. 24
- వరంగల్ లో దేశంలోనే అతిపెద్ద టెక్సటైల్ పార్క
- ద్వితీయశ్రేణినగరాలకు ఐటీ విస్తరణ
- దసరాలోగా కొత్తజిల్లాల ఏర్పాటు. వీటితోపాటుగా రెవెన్యూ మండలాల ఏర్పాటు
- హైద‌రాబాద్‌లో జర్నలిస్టులకు ప్రత్యేక కాలనీ
- తాము త‌ల‌పెట్టిన ప్రాజెక్టుల‌ను అనుకున్న ల‌క్ష్యంలోపే పూర్తి చేస్తామ‌ని తెలిపారు.
- స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అవుతున్న ఇంతవరకు సంపూర్ణ అక్షరాస్యత శాతం సాధించకపోవటం సిగ్గుచేటు. అదే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. .
- తెలంగాణలో 33 ఒకప్పుడు 33 శాతం అడవులు ఉండేవి. కానీ, ప్రస్తుతం 23 శాతమే ఉన్నాయి.  అందుకే హరితహారం అనే పథకానికి చేశాం. వానలు వాపస్ రావాలే, కోతులు వాపస్ పోవాలే... అనే  నినాదంతో,    ప్రతినియోజకవర్గంలో ఏడాదికి 40 లక్షల మొక్కలు నాటాలని ప్రజలకు, నేతలకు ఆయన పిలుపునిచ్చారు.

పొరుగు రాష్ట్రాలు మనకు బాగానే సహకరిస్తున్నాయన్న ఆయన ఏపీ మాత్రం ప్రాజెక్టులకు మోకాలు అడ్డుపెడుతోంది. అయినా ఫర్వాలేదు, చర్చలతో సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు యత్నిస్తాం. వినకపోతే న్యాయపోరాటానికి దిగుతామని చెప్పారు. కొత్త రాష్ట్రంలో పునాదులు ఎంత గట్టిగా ఉంటే, రాబోయే తరాలకు అంత మేలు జరుగుతుందన్న నమ్మకంతోనే తమ ప్రభుత్వం పని చేస్తోంది’’ వివరించారు. బంగారు తెలంగాణ కోసం స్పష్టమైన విజన్ తో ముందుకెళ్తున్నామని ఆయన ఉద్ఘాటించారు.


భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana CM  KCR  two years celebrations  parade ground  telugu news  

Other Articles