Delhi teen chases down robber, is cut with blade but holds on

Delhi teen chases down robber is cut with blade but holds on

Priyanka, karate black belt, Delhi Girl, Pandav Nagar, robber chases, police, Bhajanpura, Government Girls Senior Secondary School, Yamuna Vihar, Central Reserve Police Force

An 18-year-old girl with a black belt in martial arts chased down and nabbed a burglar in east Delhi, holding on to him even when he injured her with a blade.

రాజధాని వీధ్లులో ప్రియాంక సాహసం..

Posted: 06/02/2016 10:23 AM IST
Delhi teen chases down robber is cut with blade but holds on

అంబులెన్స్ వస్తున్నా దారి వదలని మనవాళ్లు.. అమ్మో దోంగ అనగానే చటుక్కున పక్కకు జరిగి దొంగకు దారిని వదిలేస్తారు. అక్కడ దోంగ అనే కాదండీ ఓ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తి వున్నా సరే వాడిని పట్టుకునేందుకు ధైర్యం చేయం కాని.. దారి మాత్రం వదులుతా. వాడ్ని పట్టుకుంటే ఎక్కడ తాము పోలిస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుందో, ఎక్కడ కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందోనన్న భయంతోనో,, లేక అతగాడు బెయిల్ పై వచ్చిన తరువాత తమపై ప్రతికారం తీర్చుకుంటాడనో తెలియదు కానీ మన నగరవాసుల్లో నూటికి తొంబై శాతం మాత్రం ఇలానే వున్నారు.

కానీ దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో అమ్మో దోంగ పట్టుకోండీ అంటూ అరుపులు వినబడగానే.. ప్రాణాలకు తెగించి దోంగను పట్టుకున్న ప్రియాంకను మాత్రం స్థానికంగా అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దొంగను చేజ్ చేసి మరీ పట్టుకుంది.. ఈ క్రమంలో తనకు గాయాలైన దొంగను మాత్రం వదలిపెట్టకుండా పట్టుకుంది, అయితే ఈ ప్రియాంక ఏదో ఫెద్ద వయస్సున్న అమ్మాయి కూడా కాదు. కేవలం 18 ఏళ్ల యువతి. అమె సాహసాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.

పాండవ్ నగర్ లోని తన అమ్మమ్మ ఇంటికి వేసవి సెలవుల నేపథ్యంలో వచ్చిన ప్రియాంక.. అమ్మమ్మ ఇంటి ముందు కూర్చుని ఉంది. ఇంతలో ఎదురింటి నుంచి 'దొంగను పట్టుకోండి' అంటూ అరుపులు వినిపించాయి. ఎక్కడా దోంగ అని చూస్తున్న ప్రియాంకకు అతడు పారిపోవడం కనిపించింది. ఎవరికీ చిక్కకూడదన్న భావనతో దొంగ తన శక్తినంతా కూడగట్టుకుని పరిగెడుతున్నాడు. అతడ్ని చూసిన ప్రియాంక పులిలా ముందుకు ఉరికింది. దొంగను ఛేజ్ చేసి అతడిని పట్టుకుంది.

కరాటేలో బ్లాక్ బెల్ట్ కావడంతో ఆమె ముందు దొంగ ఎత్తులు పారలేదు. అతడి మెడను పట్టుకోవడంతో పారిపోవడానికి వీళ్లేకపోవడంతో బ్లేడుతో ఆమెను గాయపరిచాడు. అయినా ఆమె పట్టువదల్లేదు. దొంగను స్థానికులకు అప్పగించింది. తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో ప్రియాంక ఎడమ చేతికి గాయాలయ్యాయి. ఆమె సాహసానికి స్థానికులు అబ్బురపడ్డారు. ఆర్మీ జవాను లేదా పోలీసు కావడమే తన లక్ష్యమని, ఇందుకోసం శ్రమిస్తున్నానని ప్రియాంక చెప్పింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే కరాటే నేర్చుకున్నానని తెలిపింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka  karate black belt  Delhi Girl  Pandav Nagar  robber chases  police  Bhajanpura  

Other Articles