కేరళ అమ్మాయి వీడియో తీసి మోదీకి పంపింది | Kerala girl Challenges Modi video viral

Kerala girl challenges modi video viral

Kerala girl, Anie rushi joshi, PM modi, అన్నె రుషి జోషి, ప్రధాని, డ్రగ్ మాఫియా, వీడియో, జాతీయ వార్తలు, latest news, telugu news

six-minute-long video by a 15-year-old girl student challenging Prime Minister Narendra Modi to save the youth from the clutches of drug mafias in the country has gone viral in the virtual world with over 22k hits in a short span of time. Anie Ribu Joshy, a Class X student of SHCGHSS, Thrissur, who lost her father at an age of four to liver cirrhosis, took up the cause as she believes the health of the nation is the health of thhe people. Anie says she has absolute faith in Modi as he has the potential to be a true world leader and he was able to showcase India as a promising country before the global community in the first two years of his rule.

ITEMVIDEOS: కేరళ అమ్మాయి వీడియో తీసి మోదీకి పంపింది

Posted: 06/01/2016 06:14 PM IST
Kerala girl challenges modi video viral

కేరళకు చెందిన పదో తరగతి విద్యార్థిని ఒకరు ప్రధాని నరేంద్ర మోదీకి పంపిన వీడియో ఒకటి ఇప్పుడు జాతీయ మీడియాలో ప్రముఖంగా మారింది. తమది పేద కుటుంబమనో,  ఆర్థిక సాయం చేయాలనో ఆమె అందులో కోరలేదు.  రెండేళ్ల పాలనలో ఎలాంటి తప్పులు దొర్లలేదంటూ ఘనంగా చెప్పుకుంటున్న సమయంలో ఈ బాలిక అడిగిన ప్రశ్నలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. గతంలో ఎంతో మంది తమ సమస్యలను విన్నవిస్తూ ప్రదానికి లేఖలు రాయగా, ఈ బాలిక మాత్రం తన గోడును వెల్లబోస్తూనే అనేక ప్రశ్నలు గుప్పించింది.  15 ఏళ్ల అన్నె రుజు జోషి అనే బాలిక మోదీని ఉద్దేశించి తయారు చేసిన ఆ వీడియో పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

కేరళలోని త్రిస్సూర్ జిల్లాకు ఈ అమ్మాయి దేశంలో విస్తరించి ఉన్న డ్రగ్ మాఫియా అంశాన్ని లేవనెత్తింది. దేశంలో ఎన్నో సమస్యలున్నాయి. అందులో ఈ మత్తుపదార్థాల దందా కూడా చాలా ముఖ్యమైనదే. యువత తొందరగా దీనికి ఆకర్షితులై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. దానిని అంతం చేయకపోతే, దేశం ఎలా బాగుపడుతుంది అంటూ వీడియోలో ప్రశ్నించింది. మొత్తం 6 నిమిషాల నిడివి గల వీడియోను వారం క్రితం అప్ లోడ్ చేయడమే కాదు ప్రధాని కార్యాలయం పీఎంవోకి మెయిల్ చేసింది. మత్తు పదార్థాల దుష్ర్పభావాలపై ఆంటూ ఆమె ఆంగ్లంలో మాట్లాడిన వీడియో క్రమంగా వ్యాపించింది. ముఖ్యంగా తీవ్రవాదం కన్నా మత్తుమందులు చాలా ప్రమాదకరమని, వాటిని నివారించే దిశగా తగు చర్యలు తీసుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నానని, ప్రధాని స్పందించాలని కోరుకుంటున్నానని చివర్లో పేర్కొంది. ఈ సందర్భంగా ఆనీ మరో విషాదకరమైన విషయాన్ని వెల్లడించింది. తన తండ్రి లివర్ క్యాన్సర్ కారణంగా మరణించాడని తెలిపింది. అందుకే తనలాంటి పరిస్థితి మరెవరికి రావొద్దని కొరుకుంటూ తన స్నేహితులు, సన్నిహితులతో కలిసి యాంటీ డ్రగ్ ఎడ్యుకేషన్ ఇనీషియేటివ్-ఫార్ట్యూన్ స్థాపించి, దాని ద్వారా తాను పోరాటం చేస్తున్నానని వివరించింది. గతంలో తన దాకా వచ్చిన ఏ సమస్యను మోదీ వదల్లేదు. మరి ఈ బాలిక పంపిన వీడియోపై ఎలా స్పందిస్తారో చూడాలి.

భాస్కర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala girl  Anie rushi joshi  PM modi  drug mafia  telugu news  

Other Articles