సచిన్ తో చేయి కలిపిన చిరు, నాగ్ | chiru and nag shook hands with sachin for KBFC

Chiru and nag shook hands with sachin for kbfc

Sachin Tendulkar, Kerala Blasters, KBFC, Chiranjeevi, Akkineni Nagarjuna, Allu Arvind, Nimmagadda Prasad, తాజా వార్తలు, సచిన్, నాగ్, చిరు, అల్లు అరవింద్, నిమ్మగడ్డ సత్యనారాయణ, కేరళ బ్లాస్టర్, national news, sports, latest news, telugu news

Cricketing legend Sachin Tendulkar is being joined by some of the biggest names in the Indian film industry as co-owners of Kerala Blasters, one of the most popular football clubs of the Indian Super League (ISL). A consortium of investors including megastars Chiranjeevi and Akkineni Nagarjuna, leading film producer - Allu Arvind and industrialist & serial entrepreneur Nimmagadda Prasad have joined hands to purchase stake in Blasters Sports Pvt. Ltd., the owners of Kerala Blasters. Sachin Tendulkar will continue to be a co-owner with Kerala Blasters, holding a significant stake. The new co-owners of Kerala Blasters were responsible for the turnaround of MAA Television Network Ltd.

సచిన్ తో చేయి కలిపిన చిరు, నాగ్

Posted: 06/01/2016 06:25 PM IST
Chiru and nag shook hands with sachin for kbfc

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, ప్రముఖ సినీ నటులు చిరంజీవి, నాగార్జునలు మరి కొందరు సినీ ప్రముఖులు బుధవారం ఉదయం తిరుమలలో సందడి చేసిన విషయం తెలిసిందే. మాస్టర్ తో వీరు దిగిన సెల్ఫీలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే కేవలం స్వామి దర్శనార్థం వీరు యాదృచ్ఛికంగా కలుసుకుని ఉంటారనుకున్న వారికి వీరు పెద్ద షాకే ఇచ్చారు. వీరి కలయిక వెనుక అసలు కారణం ఇప్పుడు తెలిసింది. కేరళ బ్లాస్టర్ పుట్ బాల్ టీం కు సచిన్ సహా యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఆయనకు 40 శాతం వాటా ఉంది. ప్రముఖ నిర్మాత పీవీపీ ఇందులో మరో భాగస్వామిగా ఉన్నారు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా ఇటీవలె ఆయన ప్రాంచైజీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఆ వాటాలను చిరు, నాగ్ లు కొనుగోలు చేశారంట. వీరితోపాటు ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్, ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ సత్యనారాయణ కూడా సహా భాగస్వాములుగా వ్యవహరించనున్నారు.

ఇక ఈ విషయాన్ని స్వయంగా సచిన్ తన ట్విట్టర్ అకౌంట్ లో వెల్లడించారు. ఈ మేర చిరు, నాగ్, అల్లు అరవింద్, నిమ్మగడ్డ సత్యనారాయణలతో దిగిన సెల్ఫీని సచిన్ షేర్ చేశాడు. అధికారికంగా మీడియా సమావేశం నిర్వహించి ప్రకటించాడు. కాగా, తిరుమలలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం వీరు అటునుంచి అటే చెన్నై మీదుగా తిరువనంతపురం చేరుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌తో భేటీ అయ్యారు. కేరళలో వీరు ఓ ఫుట్ బాల్ అకాడమీ నెలకొల్పేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకోస పూర్తిస్థాయిలో సహకరిస్తామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారని తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఇండియన్ సూపర్ లీగ్ (ఐ‌ఎస్‌ఎల్) అక్టోబర్ నుంచి మొదలు కానుంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles