ఫ్రిజ్ లో 40 పులి పిల్లల మృతదేహాలు | 40 tiger cubs bodies found in fridge

40 tiger cubs bodies found in fridge at tiger temple

Tiger Temple, Thailand, west of Bangkok, 40 tiger cubs, fridge, అంతర్జాతీయ వార్తలు, చైనా వైద్యం, పులి పిల్లల మృతదేహాలు, latest news, telugu news

Thai wildlife authorities have found 40 tiger cub carcasses in a freezer in Thailand's infamous Tiger Temple as they removed live animals in response to international pressure over suspected trafficking and abuse. The Buddhist temple in Kanchanaburi province west of Bangkok had become a tourist destination where visitors snapped selfies with bottle-fed cubs. But the temple has been investigated for suspected links to wildlife trafficking and abuse. A raid that began on Monday is the latest move in a tug-of-war since 2001 to bring the tigers under state control. Tiger parts are used in traditional Chinese medicine.

షాక్: ఫ్రిజ్ లో 40 పులి పిల్లల మృతదేహాలు

Posted: 06/01/2016 04:19 PM IST
40 tiger cubs bodies found in fridge at tiger temple

ఓవైపు సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ ప్రజలు మూఢ నమ్మకాలను వదలటం లేదు. ఆ బలహీనతను క్యాష్ చేసుకునేందుకు కొందరు ఆరాచకాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మూగజీవాలను సైతం బలి తీసుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 పులి పిల్లల మృతదేహాలు బయటపడిన సంఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. అహింసకు సంకేతమైన బుద్ధుడి ఆలయంలోనే ఇది బయటపడటం మరీ దారుణం. వన్యప్రాణుల అక్రమ రవాణా సమాచారం అందుకున్న అధికారులు బుధవారం ధాయ్ లాండ్ లోని ప్రఖ్యాత టైగర్ టెంపుల్ లో దాడి చేయగా వెలుగులోకి వచ్చింది.

కంచనాబురిలోని ఓ బుధ్ధ దేవాలయాన్ని క్రమంగా పులులను సంరక్షణ కేంద్రంగా మార్చారు. విదేశీ పర్యాటకులతో క్రమంగా దీనికి టైగర్ టెంపుల్ అనే పేరు వచ్చింది. ఇక చైనా సాంప్రదాయక వైద్యంలో పులుల శరీర భాగాలను విరివిగా వాడుతుంటారు. దీనికి శాస్త్రీయత లేదని వైద్యులు చెబుతన్నప్పటికీ ప్రజలు మాత్రం గుడ్డిగా నమ్ముతున్నారు. దీంతో పులుల శరీర భాగాల అక్రమరవాణా ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ప్రఖ్యాతిగాంచిన ఈ టైగర్ టెంపుల్ కూడా అందుకు మినహాయింపు కాదని అధికారులకు సమాచారం అందింది.  దీంతో సోదాలు నిర్వహించగా కిచెన్ లోని ఫ్రిజ్ లో 40 పులి పిల్లల కళేబరాలను లభించాయి. ప్రస్తుతం ఆరోపణలు తలెత్తడంతో మిగతా పులులను వేరే చోటుకు తరలించినట్లు నేషనల్ పార్క్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అదిసోర్న్ నుచదమ్ రాంగ్ పేర్కొన్నారు. కాగా, ఈ టైగర్ టెంపుల్ పులులకు నరకంగా మారిందని ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ యానిమల్స్ గ్రూప్ ప్రతినిధులు విమర్శిస్తున్నారు. సొమ్ముకు ఆశపడ్డ ఆలయ సిబ్బంది స్మగ్లర్లతో చేతులు కలిపి ఈ ఘాతుకానికి పాల్పడుతున్నారేమోనని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఘటన పై స్పందించేందుకు మత పెద్దలు అందుబాటులో లేరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tiger Temple  Thailand  west of Bangkok  Kanchanaburi  40 tiger cubs  fridge  telugu news  

Other Articles