Petrol price hiked by Rs 2.58 per litre, diesel by Rs 2.26 per litre

Petrol price up by rs 2 58 diesel by rs 2 26

Arun Jaitley, indirect taxes, Income Tax, petrol, diesel, Petrol prices, Diesel prices, Oil companies, barrel price, international market effect, crude oil, dollar price

Petrol and diesel prices to go up by Rs. 2.58 per litre and Rs. 2.26 per litre respectively in Delhi at midnight on Tuesday.

భగ్గుమన్న ఇంధన ధరలు.. వాహనదారుల జేబులకు చిల్లులు..

Posted: 06/01/2016 07:27 AM IST
Petrol price up by rs 2 58 diesel by rs 2 26

ఇంధన ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. వాహనదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. కేంద్రం అనుమతితో ఇందన సంస్థలు వాహనదారులను భారీగా బాదేస్తున్నాయి. లీటర్‌ పెట్రోల్‌పై రూ.2.58, డీజిల్‌పై రూ.2.26 చొప్పున పెంచుతున్నట్లు ఆయిల్‌ కంపెనీలు ప్రకటించాయి. ఈ ధరలు గత అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. చమురు ధరలపై నియంత్రణను ప్రభుత్వం ఎత్తివేశాక... అంతర్జాతీయ ఆయిల్‌ మార్కెట్‌లో పరిస్థితి, డాలర్‌తో రూపాయి మారకం విలువలో మార్పును బట్టి ఆయిల్‌ కంపెనీలు ప్రతి రెండు వారాలకొకసారి పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను సవరిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో గత నెల 16వ తేదీన పెట్రోల్‌పై లీటర్‌కు 83పైసలు, డీజిల్‌పై రూ.1.26 చొప్పున పెంచాయి. అనంతరం పక్షం రోజుల్లో అంతర్జాతీయ ధోరణులను పరిశీలించి తాజాగా మరోసారి ధరలు పెంచుతున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) ప్రకటించింది. ఆయిల్‌ కంపెనీల ప్రస్తుత నిర్ణయంతో స్థానిక పన్నులతో కలిపి హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.2.72 చొప్పున పెరిగి రూ.69.89కు పెరిగింది. డీజిల్‌ ధర లీటర్‌కు రూ.2.48 చొప్పున పెరిగి రూ.58.74కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల నేపథ్యంలో ఇంధన వినియోగదారులు మరోసారి ధరాఘాతాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్న విశ్లేషకుల అంచానాలకు అనుగూణంగా ధరలను భారీగా పెంచుతూ ఇంధన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. కాగా ఇంధన ధరల విషయంలో భవిష్యత్‌లో మరిన్ని ఘాతాలు తప్పవని, పరిస్థితులు చూస్తుంటే మార్కెట్లో పెట్రో ధరలు మళ్లీ గరిష్ఠ స్థాయి దిశగా పయనించవచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈనెలలో ప్రకటించిన ధరల వడ్డింపుతో దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ రేట్లు డిసెంబర్ 2014నాటి స్థాయికి పెరిగాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles