గూగుల్, ఫేస్ బుక్ లకు బిగ్ షాక్! | tax imposed on google and facebook in india

Tax imposed on google and facebook in india

modi government, google tax, facebook tax, గూగుల్ టాక్స్, ఫేస్ బుక్ టాక్స్, మోదీ ప్రభుత్వం, latest news, national news, business news

modi government introduced google tax. The specified services covered by the levy include online advertising, provision for digital advertising space and any other service to be notified by government. The rules come into effect from June 1.

గూగుల్, ఫేస్ బుక్ లకు బిగ్ షాక్!

Posted: 05/31/2016 05:51 PM IST
Tax imposed on google and facebook in india

గూగుల్, ఫేస్ బుక్ లకు మోదీ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ఖజానాకు భారీగా ఆదాయం రాబట్టే చర్యల్లో భాగంగా ఆయా కంపెనీల కార్యకలపాలపై పన్నును విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ‘గూగుల్ టాక్స్’ పేరిట ప్రత్యేక పన్నును ప్రకటించిన విషయం తెలిసిందే. సమానత్వపు పన్నుగా వ్యవహరింపబడే దీని ద్వారా గూగుల్ ఫేస్ బుక్ లే కాదు, బారత్ లో తమ డిజిటల్ సేవలపై అంతర్జాతీయ టెక్ సంస్థలన్నీ పన్నును కట్టాల్సి ఉంటుంది. జూన్ 1 నుంచే ఈ విధానం అమలులోకి వస్తుందని ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) మరియు పరిశ్రమల ప్రతినిధుల కమిటీ అందించిన సిఫార్సుల మేరకు ఈ విధానానికి రూపకల్పన చేశారు.

ఆన్ లైన్ వ్యాపార ప్రకటనలు, అడ్వర్టయిజింగ్ స్పేస్ తదితర సేవల పేరుతో ఇంతకాలం ఆయా కంపెనీలు భారీ లాభాలను ఆర్జించాయి. కానీ, ఇకపై వాటిపైనా పన్నును వసూలు చేస్తారు. నాన్ రెసిడెంట్ సర్వీసు ప్రొవేడర్ చెల్లింపులు అగ్రిగేట్ గా రూ.1 లక్షకంటే ఎక్కువ ఉంటే ఈ పన్ను చెల్లించాల్సిందే. మొత్తంగా ఆ వ్యాపార సంస్థ నుంచి 6 శాతం సమానత్వపు పన్నుగా వసూలు చేస్తారు. మార్కెటింగ్ కోసం ఆయా ఆన్ లైన్ సంస్థలను ఎవరైతే వాడుకుంటారో వారందరిపై ఈ భారం పడనుంది. ముఖ్యంగా భారత్ లో భారీ ఎత్తున ఆదాయం పొందుతున్న ఇంటర్నెట్ దిగ్గజాలపైనే ఈ ప్రభావం అధికంగా ఉండొచ్చని నిపుణుల అంచనా. తద్వారా అదాయం గణనీయంగా పెరగుతుందని కేంద్రం భావిస్తోంది. అయితే ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ ఆధారిత ప్రాఫిట్ షేరింగ్ ప్రాజెక్టులకు మాత్రం ఇందులోంచి మినహాయింపు ప్రకటించింది.


భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi government  google tax  facebook tax  

Other Articles