Mom Turns Her Four-year Old Son's Scar Into a Very Accurate Harry Potter Scar

Mom brilliantly turns son s forehead cut into the harry potter scar

Harry Potter, harry potter scar, mother turns son into harry potter, scar, California mother, Brittaney Benesh, coolest mother, ayden, forehead scar, Mom,Son,Boy,Harry potter scar,Transforms,Forehead cut,Lightning bolt scar,Red marker

California based Brittaney Benesh is perhaps the coolest mother around. When her four year old son Ayden got a nasty cut on his forehead, the little one got all too conscious of it and refused to go to school the next day.

తెలివైన ‘అమ్మ’ గెలుపు సాధ్యమైందిలా..!

Posted: 05/20/2016 12:59 PM IST
Mom brilliantly turns son s forehead cut into the harry potter scar

చిన్నపిల్లలు ఏదైనా విషయంలో మారాం చేస్తూ.. వారికి సర్ధి చెప్పడానికి తల్లిదండ్రులు నానా తంటాలు పడుతుంటారు. ఒకానోకదశల పిల్లల అదే పనిగా వెంటపడితే వారిని మందలించడం, లేదా సున్నితంగా చేయి చేసుకునే తల్లిదండ్రులను మనం నిత్యం చూస్తూనే వుంటి. ఆ ఏడుపు సమయంలో వారు అసలు విషయాన్ని మర్చిపోతారని అనుకుంటారు పెద్దలు. అయితే ఇలానే సాఠశాలకు వెళ్లనంటూ మరాం చేశాడు. అంత ఆ తల్లిలోనూ కోపం కట్టలు తెంచుకోవాలి. కానీ ఆ తల్లి అందరిలాంటిది కాదు. అందరిలా అలోచించనూ లేదు. కానీ మారం చేసిన తన బిడ్డను మర్నాడు పాఠశాలకు పంపింది.

అందుకు అమెలోని సృజనాత్మకత, తెలివితేటలే కారణమయ్యాయి.  అదెలా అంటారా.? అయితే ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది..? ఎప్పుడు అంటూ ప్రశ్నల వర్షం కురిపించకండి.. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఓ తల్లి తెలివి తేటలు.. చిన్నారి నగమము ఫోటోలు ఇప్పుడ అంతర్జాలంలో సంచలనం చేస్తున్నాయి.  స్కూల్ కు వెళ్లనని మారం చేస్తున్న తన మూడేళ్ల బాలుడిని తన తల్లి కొట్టకుండా తిట్టకుండా కేవలం తన తెలివి తేటలతో తిరిగి పాఠశాలకు వెళ్లేలా చేసింది.

అది కూడా గతంలో కంటే ఎక్కువ విశ్వాసంతో తరగతులకు హాజరయ్యేలా. పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రిటానీ బినేష్ అనే మహిళకు ఆడేన్ అనే మూడేళ్ల బాలుడు ఉన్నాడు. అతడు ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేసుకుంటూ స్కూల్ కు వెళుతున్నాడు. అయితే, ఇటీవల ఆ బాలుడు కిందపడ్డాడు. దీంతో అతడి నుదుటిపై గీతగీసినట్లుగా ఓ గాయం ఏర్పడింది. అలా గాయపడిన మరుసటి రోజే తాను స్కూల్ కు వెళ్లనని.. తన ఫ్రెండ్స్ ఏడిపిస్తారని మారం చేయడం మొదలుపెట్టాడు.

అన్ని రకాలుగా బ్రతిమిలాడిన ఆ తల్లి చివరకు ఓ చక్కటి ఉపాయాన్ని ఆలోచించింది. గాయం అయ్యి గీతాలగా కనిపిస్తున్న దానిని ఓ రెడ్ మార్కర్ తో ఎస్ గా మార్చింది. అనంతరం ఆ బాలుడికి హ్యారీ పోటర్ సినిమాలో హ్యారీ ధరించిన కళ్లద్దాల్లాంటివి పెట్టి అతడికి చూపించింది. హ్యారీ పోటర్ సినిమాలో హ్యారీకి కూడా నుదుటిపై అచ్చం ఇలాంటి గుర్తే ఉండటంతో ఆ బాలుడు తాను కూడా ఓ హ్యారీ పోటర్నే అన్న సంతోషంలో గెంతుతూ స్కూల్ కు వెళ్లడం మొదలుపెట్టాడు. ఈ సందర్భంగా ఆ తల్లి తన కుమారుడి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టగా వాటికి ప్రపంచ వ్యాప్తంగా లైక్ లు కామెంట్ల వెల్లువ వచ్చిపడుతోంది.

మనోహన్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brittaney Benesh  Ayden  Mom  brilliant  son  forehead  Harry Potter scar  

Other Articles