Majority of Older Americans Now Support Gay Marriage, Poll Finds

Support for gay marriage in us reaches record high

gay, LGBT, Gay marriage, US, high record, Washington, gay marriage, US, new record, same sex union, Gallup,

Support for gay marriage in the US has reached a new record high with 61 percent Americans saying that same-sex unions should be recognised by the law as valid, a poll revealed.

వాళ్ల పెళ్లిళ్లకు ఓకే చెప్పిన అమెరికావాసులు..

Posted: 05/20/2016 01:35 PM IST
Support for gay marriage in us reaches record high

అసహజ పరిణాయాలకు అగ్రాజ్యం అమెరికా వాసులు అమోదం పలికారు. ప్రతి అంశంలోనూ ముందువరుసలో నిలుస్తున్నా అమెరికా స్వలింగ సంపర్కుల విషయంలో మరో అడుగు ముందకేసింది. అమెరికా వాసులు గే మ్యారేజీలకు అనుకూలంగా తీర్పునచ్చిరు. అసహజ వివాహానికి అమెరికాలో మద్దతివ్వొచ్చా.. వాటికి చట్టపరమైన గుర్తింపు ఉండాలా అనే అంశంపై నిర్వహించిన అభిప్రాయ సేకరణలో అమెరికా వాసుల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చింది. అమెరికా అధ్యక్ష రేసులోని అభ్యర్థుల పట్ల కూడా లేనంత స్పష్టత ఈ వివాహాల విషయంలో అమెరికా వాసులు ఇచ్చేశారు.

ఇంతకీ అసహజ వివాహాలకు మద్దతుగా తీర్పునిచ్చారా..? లేక వ్యతిరేకంగానా..? అనేగా మీ సందేహం. నూటికి 61 శాతం మంది వివాహాలకు మద్దతుగా ఓటు వేశారు. వాటికి అనుమతించాల్సిందేనని, చట్టాల ద్వారా గుర్తించాలని దాదాపు 61శాతం అమెరికన్లు తమ అభిప్రాయాలు చెప్పారు. గాలప్ అనే కంపెనీ ఈ అధ్యయనం నిర్వహించింది. 1996నాటి అభిప్రాయాలతో పోల్చగా ఈసారి రికార్డు స్థాయిలో మద్దతు తెలిపారు. గాలప్ కంపెనీ 96లో నిర్వహించిన సర్వేలో కేవలం 27శాతం మంది ఇలాంటి వివాహాలకు అనుకూలంగా ఓటువేయగా, ఈ సారి మాత్రం తభిన్నంగా వారు ఓటు వేశారు.

అసహజ వివాహాలకు సంబంధించి అమెరికాలో గత కొద్ది రోజులుగా అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గాలప్ కంపెనీ స్వయంగా 2011 నుంచి ఒక అధ్యయనం ప్రారంభించింది. దాదాపు అన్ని వయసుల వారిని ఈ అధ్యయనం లో చేర్చింది. తాజాగా వారు చెప్పిన అభిప్రాయాలు గతంలో 1996నాటి సమయంలో నిర్వహించిన సర్వేతో పోల్చి చూడగా ఈసారి గతంలో చెప్పినవారి శాతంకన్నా రెట్టింపు అయింది. 30 ఏళ్లలోపు వారంతా గే వివాహాలకు ఓకే చెప్పగా.. 65 ఏళ్ల పైబడిన వారు మాత్రం ఓకే చెప్పడంతోపాటు వాటికి చట్టభద్రత ఇవ్వాలని, గుర్తింపునివ్వాలని చెప్పారు. దీంతో అమెరికా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఒక వేళ ఇదే జరిగితే అమెరికాకు వెళ్లి వివాహాలు చేసుకునే వారి సంఖ్యకూడా అంతకంతకూ పెరిగే అవకాశం లేకపోలేదని పలువరు అభిప్రాయపడుతున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Washington  gay marriage  US  new record  same sex union  

Other Articles