Venkaiah Naidu is not Kannadiga, don’t send him to Rajya Sabha, say Twitterati

Kannadigas don t want another term for venkaiah from karnataka

venkaiah, venkayya sakkaya, rajya sabha, mp, kannadiga, venkayyaSakkaya, GoBackVenkaiah, Venkaiah Naidu Rajya Sabha term, A Manjunath, Oscar Fernandez from Congress, Vijay Mallyapride, bjp, congress, karnataka, india

People from Karnataka are venting their ire at the BJP for attempting to push for Venkaiah Naidu to represent the state in the Rajya Sabha.

‘‘వెంకయ్యను రాజ్యసభకు పంపకండీ.. బాబోయ్..’’

Posted: 05/19/2016 11:10 AM IST
Kannadigas don t want another term for venkaiah from karnataka

వచ్చే నెల జూన్ లో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడుని రాజ్యసభకు పంపకండీ అంటూ ట్విట్టరైట్లు గళమెత్తుతున్నారు. ఆయన రాజ్యసభకు ఎంపికైనా తమ రాష్ట్రానికి ఏ మాత్రం లాభం చేకూర్చలేదని ఆ రాష్ట్ర ట్విట్టరైట్లు గళమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడును తిరిగి కర్నాటక నుంచి ఎంపిక చేస్తారని బీజేపీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అయితే కర్నాటక ప్రజలు మాత్రం మరోసారి తమ రాష్ట్రం నుంచి అవకాశం ఇవ్వొద్దని కోరుతున్నారు. ఇక చాలు వెంకయ్య అంటూ ట్విట్టర్ లో ప్రజలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం కర్నాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న వెంకయ్యనాయుడుకు వచ్చే జూన్ 30తో పదవీ కాలం పూర్తవుతుంది. ఇప్పటికే మూడు సార్లు (1998, 2004, 2010) రాజ్యసభకు అవకాశం దక్కించుకున్న వెంకయ్య నాయుడుకు నాలుగోసారి అదికూడా తిరిగి కర్నాటక నుంచే ఎంపిక చేస్తారని బీజేపీ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. ఆ ప్రచారం నేపథ్యంలో నెటిజన్లు ట్విట్టర్ లో స్పందిస్తూ వెంకయ్యను కర్నాటక నుంచి రాజ్యసభకు పంపించవద్దంటూ ట్వీట్లు చేస్తున్నారు.

బీజేపీ తరఫున ప్రస్తుతం కర్నాటక రాష్ట్రం నుంచి పదవీ కాలం పూర్తిచేస్తుకుంటున్న వారిలో వెంకయ్యనాయుడితో పాటు అయనూర్ మంజునాథ్ కూడా ఉన్నారు. ఇద్దరు సభ్యుల పదవీ విరమణ పొందుతుండగా కర్నాటక శాసనసభలో బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం పరిగణలోకి తీసుకుంటే ఆ పార్టీ ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలదు. అందుకని మరో మారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును అక్కడి నుంచి ఎంపీక చేస్తారన్న వార్తలు వినబబడుతున్నాయి. అయితే ఈ వార్తలను ట్విట్టరైట్లు ఖండిస్తున్నారు.

ఆయన తమ రాష్ట్ర వాసి కాదని, ఎంతసేపు కేంద్ర రాజకీయాల గురించి మాట్లాడటం తప్ప.. తమ రాష్ట్రానికి ఒనగూర్చిన ప్రయోజనమేమి లేదని మండిపడుతున్నారు. ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడటం తప్పితే.. గత రెండు పర్యాయాలుగా ఆయన ఎన్నడూ తమ భాధల గురించి ఎగువ సభలో మాట్లాడలేదని దుయ్యబట్టారు. ఇక మరికోందరైతే ఆయన కనీసం కన్నడ కూడా నేర్చుకోలేకపోయారు.. ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajyasabha elections  m.venkaiah naidu  union minister  karnataka  

Other Articles