తమిళ రాజకీయాల్లో కెప్టెన్ అట్టర్ ప్లాఫ్ సినిమా | Flop cinema on Tamil politics

Flop cinema on tamil politics

Tamilnadu, Kerala, Elections, Puducherry, Sreeshanth, Assam, BJP, Kerala, Vijaykanth, West Bengal, Jayalalitha, Karunanidhi, Mamata Banerjee, Oomen Chandi, తమిళనాడు, కేరళ, ఉమెన్ చాంది, కాంగ్రెస్ బిజెపి, పశ్చిమ బెంగాల్, ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు, కెప్టెన్, విజయ్ కాంత్

Captain VijayKanth did not reach minimum expectations. In the election results, He is not geeting voters confidence.

తమిళ రాజకీయాల్లో కెప్టెన్ అట్టర్ ప్లాఫ్ సినిమా

Posted: 05/19/2016 12:45 PM IST
Flop cinema on tamil politics

అంతన్నాడింతన్నాడో గంగరాజు నట్టేట్లో ముంచేశాడోయ్ గంగ రాజు అనే పాట ఇప్పుడు తమిళనాట విజయ్ కాంత్ కు బాగా సూట్ అవుతుంది. అయ్యవారు ఎన్నికలకు ముందు పలికిన బీరాలు.. చేసిన చమత్కాలు ఏవీ కూడా ఓటుకు పనికి రావని అక్కడి ఓటర్లు తేల్చేశారు. కెప్టెన్ గా పిలుచుకునే తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ ఓట్ల లెక్కింపులో వెనుకబడ్డారు. ఈసారి ఎలాగైనా సీఎం కుర్చీ నాదేనంటూ ప్రగల్భాలు పలికిన వ్యక్తి కనీసం తానే ఎమ్మెల్యేగా గెలవలేకపోతున్నాడు. ఉలుందూర్ పెట్టై నియోజక వర్గం నుంచి ఆయన పోటీలో నిలిచారు.

అక్కడ నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా తొలి రౌండ్ నుంచి ఆయన తన ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి వసంతవేల్ కన్నా తక్కువ ఓట్లను నమోదు చేస్తున్నారు. మూడో స్థానంలో కొనసాగుతున్నారు. మొదటి స్థానంలో డీఎంకే, రెండో స్థానంలో అన్నాడీఎంకే అభ్యర్ధులు ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఎలా అయిన గెలిచి తీరాలన్న కసిని ప్రదర్శించారు కెప్టెన్. అందుకోసం చిన్నాచితకా పార్టీలతో కలిసి ఓ కూటమిని ఏర్పాటుచేశారు. చివరికి తన పార్టీ నుంచి ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోతున్నాడు. అతని రాజకీయ సినిమా ఈ ఎన్నికల్లో అట్టర్ ఫ్లాపయినట్టే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles