Donald Trump's ex-butler says President Obama should be killed

Trump s ex butler on facebook calls for obama to be killed

Donald Trump, Anthony Senecal, Trumps ex-butler, Barack Obama, Republican Party, Facebook, US Presidential Elections 2016

United States Republican presidential candidate Donald Trump has disavowed his former butler Anthony Senecal, after he posted on Facebook that he wants President Barack Obama to be killed.

ఒబామాను హతమార్చండీ.. ట్రంప్ పనిమనిషి కామెంట్

Posted: 05/13/2016 12:46 PM IST
Trump s ex butler on facebook calls for obama to be killed

రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా అమెరికా ఎన్నికలలో దూసుకుపోతున్న డోనాల్డ్ ట్రంప్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఇంటి బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుండగా, ఆయన ఇంట్లో ఒకప్పుడు పనిమనిషిగా పనిచేసిన ఆంటోనీ సెనెకల్ రెండాకులు ఎక్కువే చదివినట్టున్నాడు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను హతమార్చాలంటూ 84 ఏళ్ల ఆంటోనీ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. అయితే అతని కామెంట్లతో తమకేమీ సంబంధం లేదని డోనాల్డ్ ట్రంప్ వర్గం స్పష్టం చేసింది.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన కుటుంబ సభ్యుల భద్రత బాధ్యతను సీక్రెట్ సర్వీస్ చూస్తుంది. దీంతో ఫేస్ బుక్ కామెంట్లు వెలుగులోకి రావడంతో ఆంటోనీ ఫేస్బుక్ పోస్టింగ్పై ఆమెరికా సీక్రెట్ సర్వీస్ విచారణ చేయనుంది. ఆంటోనీ వ్యాఖ్యలపై పూర్తిస్థాయి విచారణ చేస్తామని సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి రాబర్ట్ హొబక్ చెప్పారు. ఆంటోనీ కామెంట్స్ను అతని ఫేస్బుక్ ఫాలోవర్లు చదవడం, ఇవి బహిరంగం కావడంతో సోషల్ మీడియాలో సంచలనం రేపింది. మదర్ జోన్స్ పత్రికలో ఈ వార్త రావడంతో దుమారం రేగింది.

కాగా ఈ కామెంట్ను తానే రాశానని, ఒబామాను హతమార్చాలన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆంటోనీ చెప్పినట్టు ఆ పత్రిక వెల్లడించింది. ఒబామా మీద అతనికెందుకు కోపం వుందన్న విషయం మాత్రం అతను వెల్లడించలేదు. అదే సమయంలో ఆంటోనీ వ్యాఖ్యలను ట్రంప్ శిబిరం వెంటనే ఖండించింది. ఆయన కొన్నేళ్ల నుంచి ట్రంప్ వద్ద పనిచేయడం లేదని, ఒబామాపై చేసిన వ్యాఖ్యలతో తమకు ఏమాత్రం సంబంధంలేదని ట్రంప్ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలియజేశారు.

ఫ్లోరిడాలో ట్రంప్ ఇంట్లో ఆంటోనీ 17 ఏళ్ల పాటు పనిమనిషిగా అంటోని పనిచేశాడని ధృవీకరించిన ట్రంప్ ప్రతినిధి.. అతడెందుకు ఇంతటి తీవ్రమైన కామెంట్లు చేశాడన్న విషయం కూడా తమకు తెలియదని పేర్కోన్నాడు. రిపబ్లిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ బరిలో నిలవకముందే ఆయన పనిమానేశాడు. ఆంటోనీ వ్యాఖ్యలపై వైట్ హౌస్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఆంటోనీ గతంలో కూడా ఒబామాను ఉద్దేశించి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles