సాయిబాబా.. దేవుడా..? కాదా..? వివరణ | Sai Baba is a god or not

Sai baba is a god or not

Sai Baba, Sai Baba God, sai baba contraversy, Sai Babab Temples, Govindananda, Ramanananda, God, Hindu, Mislim, సాయిబాబా, దేవుడు, రమణానంద, గోవిందానంద

In Telugu States a big debate going on about sai baba. Some people opposing sai baba as God but somebody belives Sai Baba is a god.

సాయిబాబా.. దేవుడా..? కాదా..? వివరణ

Posted: 05/13/2016 01:14 PM IST
Sai baba is a god or not

సాయి బాబా దేవుడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రదానంగా చర్చిస్తున్న అంశం. హిందు మతం ప్రకారం అసలు సాయిబాబా అనే ఓ మామూలు వ్యక్తిని దేవుడిగా చిత్రీకరిస్తున్నారని కొంత మంది హిందువులు వాదన. కాదు.. కాదు సాయిబాబా దేవుడే అని మరికొంత మంది. తెలుగు రాష్ట్రాల్లో సాయిబాబా భక్తులకు కొదవలేదని కారణంగా దీని మీద చర్చ అనగానే అందరూ ఇంట్రస్ట్ చూపించారు. ఇంతకీ సాయిబాబా ఎవరు అన్నది ఇక్కడ ప్రధాన చర్చ కానీ ఆయన మతం ఏంటి అన్నది తర్వాతి అంశం కానీ ఇది మతంతోపాటు, నమ్మకం మీద కూడా ఆధారపడింది. మరి ఇంత కాంప్లికేటెడ్ అంశాంన్ని ఎలా చూడాలి.  

మనలో చాలా మంది ప్రతి గురువారం సాయిబాబా ఆలయాలకు వెళుతుంటాం. వెళ్లని వారు కూడా అంతకన్నా ఎక్కువ ఉండవచ్చు. కాకపోతే ఇక్కడ కొన్ని విషయాలను గమనించాలి.. గతంలో ప్రతి ఊరిలో రామాలయం ఖచ్చితంగా ఉండేది. రామాలయం లేని ఊరంటూ ఏదీ ఉండేది కాదు.. కానీ ఇప్పుడు మాత్రం సాయిబాబా ఆలయాల సంఖ్య విపరీతంగా పెరిగింది. గత పది సంవత్సరాల క్రితం నుండి లెక్కిస్తేనే పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఆలయాలు కట్టుకుంటే మంచిదే.. దీపారాధన ఉంటే ఇంకా మంచిది. కానీ ఆలయాలకు, దేవుళ్లకు కమర్షియల్ విలువలు కూడా పెంచేశారు.

నిజానికి సాయిబాబా ఆలయాలు రాకముందు  ఆలయాల పరిస్థితి , వచ్చిన తర్వాత మారిన పరిస్థితుల గురించి ఒక్కసారి చూడండి. ఓ పాత శివాలయం చూడండి.. పక్కనే ఉండే సాయి బాబా ఆలయాన్ని చూడండి. శివాలయంలో కనీసం ధూపదీపనైవేద్యాలకు కూడా చాలా కష్టం ఉంటుంది. కానీ అదే సాయిబాబా ఆలయాల్లో అయితే దేనికీ కొదవ ఉండదు. సరే ఆ దేవుడి మీద భక్తితో ఎవరో ఒకరు చేస్తున్న మంచి పనే అని అనుకుందాం. కానీ అదే సాయిబాబా పేరుతో కోట్ల రూపాయలు పొగేస్తున్న బాబాల గురించి కూడా తెలుసుకోవాలి. సాయిబాబా తత్వం అంటూ తర్వాత వచ్చిన వాళ్లకు మంచి గిరాకీ ఉందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఇక సాయిబాబా హిందువా.? లేదంటే ముస్లిం.? అని మనం గుర్తించలేని ప్రశ్న. ఆయన పేరులో ఉన్న బాబా, ఆయన పకీరు అన్న ఆధారాల ప్రకారం ఆయన ముస్లిం. కానీ ఆయన దేవుడిలా శ్రీకృష్ణుడి మందిరంలో హిందువుగా పూజలందుకుంటున్నారు. సాయిబాబా ఆలయాల్లో అందుకే విభూతిని బొట్టులా వాడతారు కాబట్టి హిందువు అని అనవచ్చు. సరే హిందువు కాదు అనుకుంటే వేరే మతం వాళ్లు ఎవరైనా ఆయన ఫలానా మా మతం అని ఎవరూ చెప్పుకోవడం లేదు. కాబట్టి ఏ మతం అనేది ప్రశ్నే కాదు.

ఆయన ఓ మామూలు మనిషి అని కొందరు.. కాదు దేవుడు అని మరికొందరు అంటారు. ఓ వ్యక్తి నడవడిక కొంత మందికి నచ్చుతుంది. మరికొంత మందికి మాత్రం నచ్చదు. దాన్ని మనం ఖండించలేం. మన కుటుంబంలో మన తాతలు మనకు తరతరాలకు మంచి చేసే ఓ పని చేశాడని అనుకోండి.. ఆయనను దేవుడిగా కొలుస్తాం.. అదే మామూలుగా ఉండిపోయారనుకోండి.. ఆయన తర్వాత ఒక్క తరం మాత్రం గుర్తుపెట్టుకుంటుంది. మిగిలిన తరాలు ఆయన గురించి మాట్లాడరు. అంటే చరిత్రలో నిలచే పనులు చేసిన వారిని ఎవరైనా గుర్తిస్తారు. అలాగే ఎవరి నమ్మకాలు వాళ్లవి.

* ఒక్క సాయిబాబా విషయంలో వివాదం...
- ఓ వర్గానికి చెందిన వ్యక్తి అనే మార్క్ ముందు నుండి ఉంది కాబట్టి

* సాయిబాబా ఆలయాల్లో జరుగుతున్న తప్పు...
- బాబా ఆలయాల్లో విగ్రహం కాళ్ల దగ్గర కొంత మంది దేవుళ్ల విగ్రహాలు ఉంచడం చాలా మందికి నచ్చలేదు

* సాయిబాబా విషయంలో అపోహ..
 - చాలా మంది సాయిబాబాను కొలిస్తే వేరే ఏ దేవుడిని కొలవకూడదు.. కొలవొద్దు అనే ఓ మూడనమ్మకాన్ని ప్రచారం చేశారు

*సాయిబాబా విషయంలో ఓ నిజం..
 - చాలా వరకు కాస్లీ దేవుడు అనే ఓ మార్క్ ఉంది. పైగా కొంత మందికి మాత్రమే సాయిబాబా దేవుడు

*సాయిబాబా విషయంలో నష్టం..
 - బాబా పేరుచెప్పుకొని బ్రతికే వాళ్లకు ఖచ్చింతగా సాయిబాబా వ్యతిరేక ప్రచారం నష్టమే

మొత్తంగా దేవుడు ఉన్నాడా లేదా అనే దగ్గరి నుండి ప్రశ్న. దేవుడున్నాడని నమ్మేవాళ్లు చాలా మంది ఉన్నారు వాళ్ల నమ్మకాన్ని ఎవరూ కాదనలేరు. మరి అలాగే సాయిబాబా మా దేవుడు అంటే ఎవరూ దాన్ని వ్యతిరేకించరు. కానీ సాయిబాబానే దేవుడు.. మిగిలిన వాళ్లు కాదు అంటే మాత్రం అది తప్పు. కేవలం ఒకరిద్దరి మనసుల నుండి వచ్చిన ఆలోచన ఏ ఒక్కరి ఉనికికి ప్రశ్నించలేదు. సాయిబాబా ఉన్నాడు అనుకునేవాళ్లకు ఉన్నాడు.. లేడు అనుకున్న వాళ్లకు లేడు. కానీ అందరి తరఫున తాము వకాల్తా పుచ్చుకున్నట్లు కొంత మంది వాదిస్తుండటం మాత్రం ఎవరికీ ఆమోదయోగ్యం కాదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles