అమితాబ్ పై ఐటీ కేసు | Supreme Court gave permission to IT dept. for reopen case against Amitabh Bachchan over his KBC earnings

Supreme court gave permission to it dept for reopen case against amitabh bachchan over his kbc earnings

KBC, Amitabh Bachan, IT, Supreme Court, సుప్రీంకోర్టు, అమితాబ్, ఐటీ శాఖ

The Supreme Court on Wednesday allowed the Income Tax (IT) department to reopen the 2001 tax case against actor Amitabh Bachchan over his earnings during the quiz show Kaun Banega Crorepati (KBC). The apex court set aside the Bombay High Court's order that gave relief to the actor in a tax dispute arising from his income from the show KBC.

అమితాబ్ పై ఐటీ కేసు

Posted: 05/11/2016 04:46 PM IST
Supreme court gave permission to it dept for reopen case against amitabh bachchan over his kbc earnings

ఈ మధ్యన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు కష్టకాలం నడుస్తున్నట్లుంది. పనామా పేపర్స్ లో ఇప్పటికే అమితాబ్ పేరు, ఐశ్వర్యారాయ్ పేర్లు బయటకు రావడంతో తీవ్ర దుమారం రేగింది. అలా బ్లాక్ మనీ వ్యహహారంలో ఇప్పటికే విమర్శలు పాలైన బాలీవుడ్ స్టార్ బిగ్ బి అమితాబ్ కు మరో కొత్త చిక్కు వచ్చిపడింది. తాజాగా బిగ్ బి పై నమోదైన 15 ఏళ్ల నాటి కేసు తిగడదోడేందుకు ఐటీ శాఖకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఆదాయపు పన్నుశాఖకు చెల్లించాల్సిన పన్నును బిగ్ బి ఎగొట్టారని అప్పట్లో ఆరోపణలు చేస్తూ ఐటీశాఖ కేసు నమోదు చేసింది.

2001లో "కౌన్ బనేగా కరోడ్‌పతి" కార్యక్రమం ద్వారా ఆయన పొందిన పారితోషికంలో పన్ను రూపంలో చెల్లించాల్సిన రూ.1.66 కోట్లు కట్టలేదని ఐటీ శాఖ అప్పట్లో కేసు పెట్టగా.. దాదాపు 11 ఏళ్ల పాటు సాగిన ఆ కేసును బాంబేకోర్టు జులై 2012లో ఈ పిటిషన్ ను కొట్టేసింది. దీనిపై ఐటీ శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ... ఐటీ శాఖ పిటిషన్ ను స్వీకరించిన అత్యున్నత ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అమితాబ్ టైం బ్యాడ్ అని చెప్పడానికి నిదర్శనం ఇదే. దాదాపు 15 ఏళ్ల క్రితం నాటి కేసు మళ్లీ ఓపెన్ కావడం అంటే ఆశామాషీ కాదు మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles