స్నేక్ గ్యాంగ్ సభ్యులకు యావజ్జీవ శిక్ష | Life Imprisonment For Snake Gang Members

Life imprisonment for snake gang members

Snake Gang, Hyderabad, Rangareddy, RangaReddy Dist Court, హైదరాబాద్, రంగారెడ్డి, స్నేక్ గ్యాంగ్

The Ranga Reddy district court has announced its verdict on sensational Snake Gang case. The court which convicted eight members in the case yesterday sentenced the seven of them to life imprisonment.

స్నేక్ గ్యాంగ్ సభ్యులకు యావజ్జీవ శిక్ష

Posted: 05/11/2016 03:59 PM IST
Life imprisonment for snake gang members

హైదరాబాద్ నగరంలోని పహాడీ షరీఫ్ ప్రాంతంలో రెండేళ్ల క్రితం ఓ ఫామ్ హౌస్ లో పాములతో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కున్న ముఠాకు రంగారెడ్డి జిల్లా కోర్ట్ శిక్షలు ఖరారు చేసింది. హైదరాబాద్ పాతబస్తీలో కలకలం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ అకృత్యాల కేసులో 8మంది నిందితులను న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. ఈ గ్యాంగ్ లో ఉన్న ఏడుగురు సభ్యులకు యావజ్జీవ శిక్ష విధించిన కోర్టు ఎనిమిదవ నిందుతునికి ఏడేళ్ళ శిక్షను విధించింది. స్నేక్ గ్యాంగ్ పై జిల్లా కోర్టు విచారణ జరిపి ఎనిమిది మందిని దోషులుగా కోర్టు నిర్ధారించింది.

9వ, నిందితునిగా ఉన్న సలాం హండిల్ ను మాత్రం నిర్దోషిగా ప్రకటించింది. సరైన ఆధారాలు లేకపోవడంతో అతనిపై వున్న కేసును కూడా కోర్టు కొట్టివేసింది. నిందితులుగా పేర్కొన్న ఎనిమిది మంది ఫైసల్ దయాని, ఖాదర్ బరాక్, తయ్యబ్ అస్లం, మహమ్మద్ పర్వేజ్, సయ్యద్ అన్వర్, ఖాజా అహ్మద్, మహమ్మద్ ఇబ్రాహిం, అలీ బరాక్లకు కోర్టు బుధవారం శిక్ష ఖరారు చేసింది. వీరిపై అత్యాచారం, హత్యాయత్నం, కిడ్నాప్, హింస, పాముతో భయభ్రాంతులకు గురిచేయడం వంటి వాటికి సంబంధించి 2014 జూలై 31న పహాడీషరీఫ్ పోలీసులు సెక్షన్ 376,341,452,323,395,506,212,411 రెడ్ విత్ 34 కేసులు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles