Belgian woman molested in Delhi, driver detained

Belgian woman molested in delhi driver detained

Ola cab driver, Belgian woman, molest, C.R.Park police station, South Delhi, GPS system, Deputy Commissioner of Police, Mandeep Singh Randhawa, Raj Singh, Alwar, Rajastan, Gurgaon to Delhi

A 23-year-old Belgian woman was allegedly molested by an Ola cab driver here in the city, police said on sunday.

బెల్జియం యువతిపై ఓలా క్యాబ్ డ్రైవర్ లైంగిక వేధింపులు

Posted: 05/08/2016 11:42 AM IST
Belgian woman molested in delhi driver detained

మనది భిన్నమైన సంస్కృతి కల దేశమని నేతలు మాటలకే పరిమితం కావడంతో.. అకాశంలో సగం అంటూ దూసుకెళ్తున్న మహిళలు నానాటికీ అన్ని రంగాలలో తమ ప్రతిభను చాటుకుంటూ ముందుకు కదులుతున్నారు. అయితే పురుషాదిక్య సమాజంలో పురుష పక్షపాతిగా నిలిచే లోకంలో మగాడు రాను రాను మృగాడిలా మారుతున్నాడు. ఆడది ఒంటరిగా కనబడితే చాలు అమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.

కేంద్రంలో నరేంద్రమోడీ సర్కార్ కొలువుదీరిన తరువాత కూడా అబలలపై దౌర్జన్యాలు, అఘాయిత్యాలు, అరచాకాలు మరింత శృతిమించుతున్నా.. ఈ అంశంలో మాత్రం ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఢిల్లీ అసెంబ్లీకి క్రితం పర్యాయం జరిగిన ఎన్నికలలో ఆ మధ్యకాలంలోనే చోటుచేసుకున్న నిర్భయ ఘటనను ప్రచారాస్త్రాంగా మలిచింది బీజేపి. తాము అధికారంలోకి వస్తే.. మహిళలపై అత్యాచారాలు జరగకుండా నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కూడా హామి ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఒక్క అడుగు వేసిన దాఖలాలు కూడా కనిపించడం లేదు.

ఎన్నికల సందర్భంగా ప్రధాని నుంచి బీజేపి నేతలందరు ఇచ్చిన హామీలు నీటిమూటలుగా మిగులుతున్నాయన్న విమర్శలు వచ్చినా.. కేంద్రానికి పట్టినట్లు లేదు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఓలా క్యాబ్ డ్రైవర్ విదేశీ వనితపై అసభ్యతకు దిగాడు. బెల్జియానికి చెందిన 23 ఏళ్ల మహిళపై ఓలా క్యాబ్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దక్షిణ ఢిల్లీలోని సీఆర్ పార్క్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి బాధితురాలు ఫిర్యాదు చేసుకుంది. 'ఈ సంఘటన జరిగిన తర్వాత కొద్ది గంటల్లోనే మేం డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నాం.

అతడు రాజస్థాన్ లోని అల్వార్ ప్రాంతానికి చెందినవాడు' అని పోలీసులు తెలిపారు. గూర్గావ్ ప్రాంతంలో ఓ బెల్జియం మహిళ ఢిల్లీకి ఓలా క్యాబ్ బుక్ చేసుకుంది. అయితే, జీపీఎస్ వ్యవస్థ పనిచేయడం లేదని, వచ్చి ముందుకూర్చుని రూట్ చూపించాలని కోరాడు. అనంతరం ఆమె ముందు కూర్చొని దారి చూపించే క్రమంలో లైంగికంగా, అసభ్యకరంగా తాకడం మొదలు పెట్టాడు. అలా, ఆమె వచ్చే మార్గంలో చాలాసేపు లైంగికంగా వేధించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Belgian woman  molest  Delhi  Ola cab driver  gurgaon  gps system  rajasthan  alwar  

Other Articles