Ilayaraja has badly let down Tamil people says Gangai Amaran

Gangai amaran lashes out on illayaraja for rejjecting national award

Ilayaraja, Tamil people, Gangai Amaran, National Award, rejection, Tamil, movies, headlines, gossip, entertainment, videos, songs, music, Tamil trailers, Tamil videos, Tamil mp3, Tamil actress,Tamil actors, Telugu movies reviews,Telugu movie reviews,Telugu movie previews,Telugu songs, bakthi, Tamil Nadu

The controversy over Ilayaraja refusing the National Award for the best background score for ‘Thaarai Thappattai’ is raging on and we caught up with the maestro’s brother and jury member Gangai Amaran

తమిళుల మనోభావాలను గాయపర్చిన ఇళయరాజా

Posted: 05/08/2016 10:59 AM IST
Gangai amaran lashes out on illayaraja for rejjecting national award

ఇళయరాజాపై ఆయన సోదరుడు, సంగీత దర్శకుడు గంగైఅమరన్ ఫైర్ అయ్యారు. జాతీయ అవార్డును తిరస్కరించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇటీవల పలువురు విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆయన చర్యను చాలా మంది గర్హిస్తున్నారు. ఇళయరాజా 1000వ చిత్రం తారైతప్పటై చిత్ర నేపథ్య సంగీతానికి గాను ఆయనకు జాతీయ అవార్డు వరించింది. అయితే దాన్ని ఆయన తన సంగీతానికి సరైన గుర్తింపు లభించలేదంటూ తిరస్కరించారు. ఈ విషయంలో ఇళయరాజా నిర్ణయాన్ని ఆయన సోదరుడు, జాతీయ అవార్డుల జ్యూరీ సభ్యుల్లో ఒకరైన గంగైఅమరన్ తీవ్రంగా ఖండించారు.

ఇళయరాజా చర్యను తప్పు పట్టారు. ఈ విషయంపై గంగైఅమరన్ స్పందిస్తూ ఇళయరాజా గొప్ప సంగీత దర్శకుడే. అలాగని జాతీయ అవార్డును తిరస్కరంచడం సరైన చర్య కాదు.సంగీతంలో ఇద్దరికి అవార్డును అందించడంలో తప్పేమిటి? సంగీతానికి, పాటలకు ఒకరికే అవార్డు ప్రకటించాలనడంలో అర్థం లేదు. ఆస్కార్ అవార్డుల్లో ఇలాంటి విధానం లేదు. అయినా ఇప్పుడు ఒక్క ఇళయరాజా మినహా పాటలకు, నేపథ్యసంగీతానికి  ఏ సంగీత దర్శకుడు అందిస్తున్నారు. ఒక్కో పాటకు ఒకరు సంగీతాన్ని అందిస్తున్న రోజులివి. అదే విధంగా పాత చింతకాయ పచ్చడిలా ఎప్పుడూ ఒకే తరహా సంగీతాన్ని అందిస్తే ఎలా? కొత్త కొత్త సంగీత దర్శకులు వస్తున్నారు. మన కాలం ముగిసిందన్న ఆలోచనకు రావాలి.

ఇప్పుటికీ తాను యువకుడినే అనే ఆలోచనా ధోరణిని మార్చుకోవాలి. ఇళయరాజా గొప్ప సంగీత దర్శకుడే.అలాంటి వ్యక్తి భారతదేశంలో అత్యున్నతమైన జాతీయ అవార్డును తిరస్కరించడం ఆయన అభిమానులైన తనలాంటి వారికి అసంతృప్తిని కలిగించే విషయం.  ఒక వేళ ఆయనకు అవార్డు అందుకోవడం ఇష్టం లేకపోతే ఆ విషయాన్ని ముందే తెలిపితే ఆయన చిత్రాలు పరిశీలించేటప్పుడు ఇళయరాజా అవార్డును స్వీకరించరు అని ఆ చిత్రాలను పక్కన పెడతాం. విచారణై చిత్రానికి జీవీ మంచి సంగీతాన్నే అందించారు.ఆయనకు జాతీయ అవార్డును ప్రకటించి యువ సంగీతదర్శకులను ప్రోత్సహించే వారమని గంగైఅమరన్ తన సోదరుడు ఇళయరాజాపై విరుచుకుపడ్డారంటూ మీడియాలో ప్రచారం హల్‌చల్ చేస్తోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gangai amaran  Ilayaraja  National Award  rejection  Tamil Nadu  

Other Articles

  • Model diksha singh to contest up panchayat elections 2021

    ఉత్తర్ ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో గ్లామర్ డోసు..!

    Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more

  • Anand mahindra fulfills promise tn s famous idli amma gets new home workspace

    ఇడ్లీ బామ్మకు ఇల్లు కట్టించిన పారిశ్రామిక వేత్త

    Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more

  • Elangana mlas took drugs at bengaluru party police probe reveals

    బెంగళూరు డ్రగ్స్ కేసు: తెలంగాణలో బయటపడిన లింకులు

    Apr 03 | బెంగళూరు డ్రగ్స్‌ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more

  • Himanta biswa sarma pleads to revoke ban after ec bars him from campaigning

    హిమాంత తరువాత సుశాంతపై కూడీ ఈసీ బదిలీ వేటు

    Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more

  • Bjp lodges complaint against udhayanidhi stalin for remark against pm modi

    ప్రధాని మోదీపై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..

    Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more

Today on Telugu Wishesh