ప్రభుత్వ కాలేజీలకు నీట్ నుండి ఊరట | NEET for all, except govt colleges: SC

Neet for all except govt colleges sc

NEET, Supreme Court, NEET Exam, Medical Council Of India, నీట్, ఎంసెట్, సుప్రీంకోర్టు

The Supreme Court on Friday said it would allow state governments to hold their own entrance tests for admitting students in their medical colleges. But all private medical institutions, including deemed universities, would have to take students only through the National Eligibility-cum-Entrance Test (NEET) being conducted by the Medical Council of India (MCI) through the Central Board of Secondary Education (CBSE).

ప్రభుత్వ కాలేజీలకు నీట్ నుండి ఊరట

Posted: 05/07/2016 07:50 AM IST
Neet for all except govt colleges sc

‘నీట్’ విషయంలో ప్రభుత్వ కాలేజీలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గవర్నమెంట్ కాలేజీలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించుకోవచ్చన్న ఎంసీఐ వాదనతో సుప్రీం ఏకీభవించింది. అంతేకాకుండా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ కళాశాలలకు ఈ ఏడాది ప్రవేశ పరీక్ష నిర్వహించుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. దీంతో ప్రభుత్వ కళాశాలలకు ఊరట లభించింది. కాగా ప్రైవేటు కళాశాలలకు నీట్ ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.


వైద్య విద్యా కోర్సుల్లో దేశవ్యాప్త ఉమ్మడి ప్రవేశ పరీక్ష నీట్ నుంచి తమను మినహాయించాలని కోరుతూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ వైద్య కళాశాలలు దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తులపై సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది. మే 1న జరిగిన తొలి విడత పరీక్షకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు.. జూలై 24న జరిగే పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నీట్ పై కొత్త ప్రతిపాదనలను తయారు చేసి సుప్రీంకోర్టులో సమర్పించింది. ఎంసీఐ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటామని కోర్టు తెలిపింది. నీట్ పై తదుపరి విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles