'Lady Singham' made panchayat secretary do sit ups over corruption – Watch video

Panchayat secretary raises fake bills ias officer makes him do sit ups

fake bill, IAS Officer, Panchayat CEO, Nidhi Nivedita, Singrauli district, Madya Pradesh, lady singham, viral video

An IAS officer from Madhya Pradesh, Nidhi Nivedita, punished a Panchayat Secretary in Singrauli district by making him do sit-ups.

ITEMVIDEOS: ‘లేడీ సింగమ్’ నివేదితను పొగిడేస్తున్న నెట్ జనులు..

Posted: 05/05/2016 08:36 PM IST
Panchayat secretary raises fake bills ias officer makes him do sit ups

అప్పట్లో రోడ్డు నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లను నడిబజారులో నిలదీసి ఐఏఎస్ అధికారిణి చంద్రకళ శెభాష్ అనిపించుకోగా.. తాజాగా మరో ఐఏఎస్ అధికారిణి ఓ లంచగొండికి చుక్కలు చూపెట్టింది. నకిలీ బిల్లులు పెట్టి సర్కారు సొమ్మును బుక్కాలని చూసిన ఓ పంచాయతీ కార్యదర్శిని పబ్లిగ్గా గుంజీలు తీయించింది, పోటో షాపు చేసిన ఫోటోలు పెట్టి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి, ప్రజాసోమ్మును దోచుకోవాలని చూసిన కాంట్రాక్టరుకు చుక్కలు చూపించింది.

మధ్యప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి నిధి నివేదిత. సింగరౌలి జిల్లాలోని ఓ గ్రామంలో నిర్మించిన బహిరంగ మూత్రశాలల బయట వాష్ బేసిన్స్, ట్యాపులు ఏర్పాటుచేయించినట్టు.. మార్ఫింగ్ ఫొటోలతో బిల్లులు పంపించాడు పంచాయతీ కార్యదర్శి. అయితే లేడీ అధికారి కదా.. పరిశీలించడానికి ఎలాగు రారనుకున్న ఆ పంచాయితీ కార్యదర్శికి అమె పరిశీలిస్తానని చెప్పడంతోనే కార్యదర్శికి మింగుడు పడలేదు. కాగా ఆ ముహూర్తం ఇవాళ రానే వచ్చింది.

ఐఏఎస్ అధికారిణి నివేదిత మధ్యప్రదేశ్ సింగరోలి జిల్లాలోని ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ వాష్‌ బేసిన్లు, ట్యాపులు లేకపోవడంతో ఇదేమిటని నిలదీశారు. దీంతో తాము ఫొటోషాపింగ్ చేసిన ఫొటోలతో బిల్లులు సమర్పించామని అతడు నిజాన్ని ఒప్పుకున్నాడు. అవినీతి చర్యలకు పాల్పడిన అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఐఏఎస్ నివేదిత.. అతన్నితో అక్కడే గుంజీలు తీయించింది. అవినీతికి పాల్పడితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్‌లో కలెక్టర్‌గా పనిచేస్తున్న తెలంగాణ బిడ్డ చంద్రకళ గతంలో అవినీతి అధికారులపై ఇలాగే ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles