'Was Sold To Goa Lawmaker For 50 Lakh', Says Teen Who Was Allegedly Raped

Accused of raping minor ex goa education minister surrenders

Babush Monserrate,Goa legislator Babush Monserrate,Goa Lawmaker Babush Monserrate,Nepalese girl,Nepalese girl sold,Goa Police

Goa lawmaker Babush Monserrate, accused by the police of buying and then raping a young Nepalese girl, surrendered this afternoon and has been arrested.

అమ్మాయిని కొని అత్యాచారం చేసిన ఎమ్మెల్యే.. సరెండర్

Posted: 05/05/2016 09:38 PM IST
Accused of raping minor ex goa education minister surrenders

వివాదాస్పద ఎమ్మెల్యే బాబుష్ మోన్సిరేట్‌ ఓ నేపాలీ అమ్మాయిని కొనుగోలు చేసి, ఆమెపై అత్యాచారం జరిపినట్టు అభియోగాలు ఎదుర్కోంటున్న నేపథ్యంలో అయన ఇవాళ పోలీసులకు సరెండర్ అయ్యారు. అత్యాచారం నేపథ్యంలో బాలిక ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయనపై మానవ అక్రమ రవాణా, రేప్ అభియోగాలను మోపినట్టు పోలీసు వర్గాలు మీడియాకు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులకు బాలిక వాంగ్మూలంలో అనేక విషయాలు వెలుగుచూశాయి.

తన సవతి తల్లి, తన 'ఆంటీ' కలిసి ఎమ్మెల్యే మోన్సిరేట్‌ కు తనను రూ. 50 లక్షలకు అమ్మేశారని నేపాల్‌కు చెందిన 16 ఏళ్ల బాధిత బాలిక పోలీసులకు తెలిపింది. అతను తనను తన బంగ్లాకు తీసుకెళ్లాడని, అక్కడ తనకు మద్యం తాగించి అత్యాచారం జరిపాడని ఆమె పోలీసులకు వెల్లడించింది. 'ఆ రోజు తెల్లారి నేను లేచిచూసేసరికి.. నా ఒంటిమీద దుస్తులు లేవు. రక్తంతో నేను తడిసిపోయి ఉన్నాను. నా పక్కన ఆయన బట్టలు లేకుండా నగ్నంగా కూచోని ఉన్నాడు' అని ఆమె గోవా బాలల సంరక్షణ కమిటీకి తెలిపినట్టు తెలిసింది. కొలువు కోసం మోన్సిరేట్‌ను నువ్వు కలువబోతున్నావని, కాబట్టి చక్కగా దుస్తులు వేసుకొని తయారై ఉండమని తన సవతి తల్లి తనకు చెప్పి మోసం చేసిందని ఆమె బాలల కమిటీ ముందు ఆవేదన వ్యక్తం చేసింది.

గత కాంగ్రెస్ ప్రభుత్వంలో గోవా విద్యాశాఖ మంత్రిగా చేసిన మోన్సిరేట్‌పై పలు అరోపణలు రావడంతో ఆయనను కాంగ్రెస్ తమ పార్టీ నుంచి బహిష్కరించింది. అప్పటి నుంచి ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చాడు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని అంటున్నాడు. మరోవైపు ఈ కేసులో బలమైన ఆధారాలతో ముందుకు వెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే బాధిత బాలికతో మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇప్పించాలని పోలీసులు నిర్ణయించారు. అలాగే, సవతి తల్లిపైనే కేసు పెట్టి అరెస్టు చేయాలని భావిస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Goa legislator Babush Monserrate  young Nepalese girl  rape  crime  

Other Articles