Hrithik Roshan tried slut shaming Kangana but she won’t succumb: Lawyer

Hrithik roshan slams anti kangana trend on twitter

kangana ranaut, hrithik roshan, kangana ranaut news, hrithik roshan news, anti kangana trend, hrithik roshan twitter, kangana ranaut latest news, hrithik roshan latest news, kangana ranaut hrithik roshan, kangana hrithik news, kangana hrithik latest news, entertainment news

Hrithik Roshan has criticised a Twitter trend which attacks Kangana Ranaut by calling her "characterless" and "publicity hungry".

క్యారెక్టర్ లెస్ కంగనా.. వ్యాఖ్యలపై మండిపడ్డ నటుడు

Posted: 05/02/2016 03:02 PM IST
Hrithik roshan slams anti kangana trend on twitter

లవ్ ఎఫైర్ విషయంలో బజారున పడి లవ్ థ్రిల్లర్ సస్సెన్స్ సినిమాను తలపిస్తున్న బాలీవుడ్ నటీనటులు హృతిక్ రోషన్.. కంగనా రౌనత్ ల ప్రేమ వ్యవహారంలో మరో ట్విస్ట్ ఏర్పడింది. ఎవరికీ తెలియకుండా గుట్టుగా ఎన్నో ప్రేమ వ్యవహారాలు జరుగుతున్న సెలబ్రీటీ ప్రపంచంలో వారు ఎప్పుడు ఒకటవుతున్నారు..? ఎప్పుడు విడిపోతున్నారన్న విషయాలు వారి కలసివున్నప్పుడో, లేక విడిపోయిన సందర్భాల్లోనో మనకు తెలుస్తున్నాయి తప్ప.. మరో సందర్భంలో మాత్రం తెలిసే ప్రసక్తే లేదు. అలాంటిది జరగాల్సినదంతా జరిగిపోయాక, చేయాల్సినదంతా చేసేశాక.. ఇప్పుడు మొసలికన్నీరు కారిస్తే ప్రయోజనం ఏముంటుంది. సరిగ్గా అలానే చేశాడు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్.

కంగనా అనే కాదు. ఒక అమ్మాయిని నడిబజారులో నిల్చోబెట్టి, అమె తనతో ప్రేమ వ్యవహారం నడిపించిందని, అయినా అది వన్ సైడ్ లవ్ మాత్రమేనని, తనకు ఆ ప్రేమతో సంబంధం లేదని నిర్మోహమాటంగా చెప్పింది ఎవరు..? తనను ప్రేమలో దింపడానికి కంగనా ఎకంగా తనకు న్యూడ్ ఫోటోను పంపిందని మీడియాకు వార్తలను లీక్ చేసింది ఎవరు..? అమెకు మానసిక ప్రశాంతత లేకుండా చేసింది ఎవరు..? అమె ప్రేమ విషయంలో రోజుకో విషయాన్ని పత్రికలకు ఉప్పందించింది ఎవరు..? ఈ విషయాలన్నింటికీ సమాధానం మీకు తెలుసు.

అయితే ఇప్పుడు తాజాగా అమె క్యారెక్టర్ లేనిదని అనగానే అలా చేయడం సమంజసం కాదంటూ ట్వట్టరైట్ పై మండిపడ్డాడు హృతిక్. కంగనాను ఆడిపోసుకుంటూ ట్విట్టర్లో వస్తున్న వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా స్పందించారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిందించడం వ్యక్తిత్వం లేని చర్య అని హృతిక్ మండిపడ్డారు. అవసరం అయితే ప్రేమను పంచాలిగానీ ఇలా ఒకరిని బయటకు ఈడ్చడం అపాయకరమైన చర్య అని అన్నారు. హృతిక్ రోషన్, కంగనా రనౌత్ మధ్య ప్రత్యక్ష యుద్ధం జరుగుతోందంటూ మీడియాలో కథనాలు వస్తుండగా.. అదేం లేదన్నట్లుగా హృతిక్ రోషన్ స్పందించారు.

కంగనా రనౌత్కు హృతిక్ రోషన్ తో ఉన్న సంబంధాల గురించి కొంతమంది ట్విట్టర్లో అసభ్యకరమైన వ్యాఖ్యలు పెట్టారు. 'నేను కంగనా నటనను ఇష్టపడతాను. కానీ క్యారెక్టర్ లెస్ కంగనా దిగజారుడు జిమ్మిక్కులకు కాదు' అని ఓ ట్విట్టర్ యూజర్, 'ప్రచారం కోసం వివాదాస్పద అంశాన్ని కంగనా ఉపయోగించుకుంటుంది. ఇది చాలా దిగజారుడుతనం. క్యారెక్టర్ లెస్ కంగనా' అని మరో వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అయితే కంగనాను ఇంతగా చీఫ్ చేసిందెవరన్నది మాత్రం చేసిన వాళ్లకే తెలియాలి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hrithik Roshan  Slams  Characterless  Kangana  Trend  Twitter  

Other Articles