Bollywood actor in balakrishnas Gauthamiputra shatakarni

Bollywood actor in balakrishnas gauthamiputra shatakarni

Bollywood, Balakrsihna, Krish, gauthamiputrashatakarni, గౌతమీపుత్ర శాతకర్ణి, బాలకృష్ణ, క్రిష్

Bollywood actor got place in Balakrishna and Krish's Gauthami putra shatakarni. may he play key role in this cinema.

గౌతమీపుత్రలో ఆ బాలీవుడ్ యాక్టర్

Posted: 05/02/2016 03:42 PM IST
Bollywood actor in balakrishnas gauthamiputra shatakarni

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మీద టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. ఈ మధ్యన ఫ్యాన్ మేడ్ టీజరే ఇంటర్నెట్ లో దుమ్మురేపింది. కాగా ఈ చారిత్రాత్మక సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు అన్న దాని మీద ప్రస్తుతానికి ఫుల్ క్లారిటీ అయితే రాలేదు. కానీ హేమామాలిని బాలయ్యకు తల్లిగా నటిస్తున్నట్లు తెలిసింది. కాగా తాజాగా మరో బాలీవుడ్ యాక్టర్ ను ఈ సినిమా కోసం సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఆయన ఎవరో అనుకుంటున్నారా..?

ఎంతో భారీగా నిర్మిస్తున్న బాలయ్య బాబు వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిలో మరో బాలీవుడ్ యాక్టర్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. కబీర్ బేడీతో ఈ సినిమాలో ఓ కీలక పాత్రను వేయిస్తున్నట్లు తెలిసింది. బాలీవుడ్ స్టార్లను కూడా ఈ సినిమాలో తీసుకోవడం ద్వారా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారా అని కొంత మంది భావిస్తున్నారు. కాగా ఈ సినిమాలో కీలక పాత్ర అంటే బాలయ్యకు తండ్రిగా లేదంటే విలన్ గా కబీర్ బేడీ నటిస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి దీని మీద క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు కావాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles