రేప్ చేసిన వాడి చేతులు నరికేశాడు | Toddler rape victim's father chops-off accused's hands in revenge

Toddler rape victim s father chops off accused s hands in revenge

Rape, Punjab, India, Rape on Child, Punjab state, పంజాబ్, రేప్, రేప్ బాదితులు

An enraged father, who sought revenge for his daughter's (a toddler) rape, allegedly chopped off the accused's hands, in Punjab's Bhatida District on 19 April. The accused is a minor. The toddler was eight-months-old at the time of incident

రేప్ చేసిన వాడి చేతులు నరికేశాడు

Posted: 04/20/2016 04:33 PM IST
Toddler rape victim s father chops off accused s hands in revenge

పసికందు మీద అత్యాచారం చేసిన ఓ కామాంధుడి చేతులు నరికేశాడు ఓ తండ్రి. మామూలుగా అయితే ఇలాంటి వార్తలు ఏ అరబ్ దేశాల్లోనో జరుగుతుంటాయని వింటుంటా. కానీ మన దగ్గర కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. చాలా మంది కామాంధులు రేప్ చేసినా కానీ వారికి శిక్షపడుతుంది ఎలాంటి భయమూ లేదు. కోర్టుల చుట్టూ సంవత్సరాలు సంవత్సరాలు తిరిగి న్యాయం జరగక అత్యాచార బాధితులు బాదపడుతుంటారు. అలా కాకుండా పంజాబ్ కు ఓ చెందిన ఓ వ్యక్తి తన ఎనిమిది నెలల పాపపై అత్యాచారం చేసిన యువకుడి చేతులు నరికేశాడు.

తన ఎనిమిది నెలల కూతురుపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై తండ్రి ప్రతీకారం తీర్చుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ లోని బాటిండాకు సమీపంలోని కోట్లిఅల్బూ గ్రామంలో గతేడాది ఏప్రిల్ లో ఎనిమిది నెలల చిన్నారిపై పర్మీందర్ సింగ్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది. అయితే చిన్నారి తండ్రి పమ్మా సింగ్, యువకుడు పర్మీందర్ సింగ్ విచారణలో భాగంగా కోర్టుకు హాజరయ్యారు. వీరిద్దరూ తమ గ్రామానికి తిరిగి వస్తుండగా కేసును రాజీ కుదుర్చుకుందామని పర్మీందర్ ను పమ్మా సింగ్ పిలిచాడు. మార్గం మధ్యలోనే పర్మీందర్ ను చెట్టుకు కట్టేసి రెండు చేతులు నరికివేశాడు. తీవ్ర గాయాలపాలైన పర్మీందర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles