బిర్యానీ తినేవాళ్లు జాగ్రత్త | Beware from Birayani

Beware from birayani

Biryani, Hyderabad Biryani, Biryani for Health, Alchohol, ఆల్కహాల్, బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ

Biryani lovers may shock after reading this news. In a latest survey scientists releavl that Biryani will give alchohol effects in our body.

బిర్యానీ తినేవాళ్లు జాగ్రత్త

Posted: 04/20/2016 03:20 PM IST
Beware from birayani

బిర్యానీ అనగానే మనలో చాలా మందికి నోరూరుతుంది. ఆవురావురు మంటూ బిర్యానీని కడుపునిండా లాగించేస్తుంటాం. అలాంటి బిర్యానీ ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీలాగించేయడం మామూలే కానీ అదే ప‌నిగా బిర్యానీ లాగించే వారికి ఓ బ్యాడ్ న్యూస్‌. తమకు మద్యం తాగే అలవాటు లేదు.. కేవలం బిర్యానీ మాత్రమే ఇష్టంగా లాగించేస్తాం అనుకున్నా కూడా వారికి బ్యాడ్ న్యూస్ త‌ప్ప‌ద‌ట‌. ఆల్కాహాల్ ప్రభావంతో వచ్చే కాలేయ సమస్యలు అతిగా చికెన్, మటన్ బిర్యానీలు లాగించేసినా వస్తాయట. బిర్యానీతోపాటు తీసుకునే కూల్ డ్రింక్‌ల ప్రభావంతో ఈ కాలేయ సమస్యలు మరింత ఎక్కువవుతాయట. ఈ విషయాలు ఓ పరిశోధనలో తెలిశాయి.

తాజా ప‌రిశోధ‌న‌ల్లో మ‌ద్యం, ఆల్క‌హాల్‌, సిగ‌రెట్ల అల‌వాట్లు లేకున్నా వారం వారం క్రమం తప్పకుండా బిర్యానీని ఫుల్లుగా లాగించే వారికి కాలేయ స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ట‌. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అకస్మాత్తుగా కడుపునొప్పి రావడం, ఛాతి నొప్పి, నీరసం వంటి లక్షణాలతో బాధితులు ఎక్కువగా ఆసుపత్రి మెట్లు ఎక్కుతున్నారని పరిశోధనలో తేలింది. బిర్యానీల్లో వనస్పతి, నెయ్యి, డాల్డా, మసాలా వంటి దినుసులను ఎక్కువగా వాడటం, కొన్ని రెస్టారెంట్లలో క్వాలిటీ లేని మాంసాన్ని ఉపయోగించడం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయని డాక్టర్లు చెబుతున్నారు.

ఒక్క బిర్యానీని తింటే సుమారు 500 కేలరీలు చేరతాయని, అంత భారీ మొత్తంలో కేలరీలు మనిషికి ఒకే సారి అవసరం లేదని చెబుతున్నారు. దీంతో ఇక‌పై బిర్యానీ అదే ప‌నిగా లాగించేవారు ఇక‌పై త‌క్కువ‌గా మితంగా బిర్యానీ లాగించ‌డం మంచిద‌ని ఈ ప‌రిశోధ‌న చేసిన వైద్యులు చెపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles