చిల్లీ పన్నీర్ విత్ కండోమ్ | Chilli paneer with condom

Chilli paneer with condom

Condom, Chilli paneer, food, condom in food box, Jharkhand, కండోమ్, చిల్లీ పనీర్

Gone are the days when one had to dress up, step outside their home, travel all the way to a restaurants to satisfy their cravings. Thanks to the technically advanced world that we now live in, everything lies just a click away. Online shopping services not only satisfy your clothing needs but also your basic physiological needs; food.

చిల్లీ పన్నీర్ విత్ కండోమ్

Posted: 04/20/2016 04:35 PM IST
Chilli paneer with condom

పనీర్ దోశ విత్ ఎక్స్ ట్రా పనీర్ అని విన్నాం...  కానీ ఎక్కడైనా చిల్లీ పన్నీర్ విత్ కండోమ్ అని విన్నామా..? వినలేదు కదా.. కానీ ఓ మహిళకు మాత్రం ఇదే ఆర్డర్ వచ్చింది. ఆమె చిల్లీ పన్నీర్ ఆర్డర్ చేస్తే చిల్లీ పన్నీర్ తో పాటుగా కండోమ్ కూడా వచ్చింది. దాంతో ఆమె షాకైంది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ లో జరిగింది. టాటా స్టీల్ ఫ్యాక్టరీలో పని చేసే ఉద్యోగినికి ఈ చేదు అనుభవం ఎదురైంది. బాధితురాలు దోశా హట్(Dosa Hut) అనే రెస్టారెంట్ నుంచి రోల్ దోశె, చిల్లీ పన్నీర్ ను ఆర్డర్ చేసింది. ఫుడ్ యాప్ గ్రేవీ కార్ట్(Gravycart.com) ద్వారా ఆర్డర్ చేసిన అరగంటలోనే ఫుడ్ ప్యాక్ ఇంటికి వచ్చేసింది. ఇష్టమైన వంటకం కళ్లు ముందుకు వచ్చేసరికి లొట్టలేసుకుంటూ తిందామని భావించిన ఆమె.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్యాక్ ఓపెన్ చేసింది. అది ఓపెన్ చేసి చూడగానే ఆమెకు షాక్ కొట్టినంత పనైంది.

చిల్లీ పన్నీర్ కర్రీ లో కండోమ్ కూడా కనిపించి. దీంతో ఆమె కంగుతింది. పైగా కర్రీ కూడా పూర్తిగా లేదట సగం మాత్రమే ఉందట. ఎవరో కావాలనే ఈ పని చేశారని ఆమె ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని ఆ రెస్టారెంట్ ఓనర్ ను అడిగితే.. అతడు మరోలా జవాబిచ్చాడు. తమ వైపు నుంచి ఎలాంటి తప్పు జరగలేదంటున్నాడు. ఆ కండోమ్ అందులోకి ఎలా వచ్చాదో తమకు తెలియదన్నాడు. ఒకవేళ పొరపాటున కర్రీలో కండోమ్ పడి ఉంటే.. అది ముక్కలైపోయి ఉండేది కదా అని వాదిస్తున్నాడు. అంతేకాదు సదురు మహిలే సగం కర్రీ తినేసి అందులో కండోమ్ వేసిందేమో అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles