This is a romantic business

This is a romantic business

Moods, Romance, Kerala, Moods planet, కేరళ, రొమాన్స్, మూడ్స్ ప్లానెట్

In Kerala State, Tiruvanatapuram a business man started a romantic business. He is selling condoms in A show room named as moods planet.

మూడ్ తెప్పించే వ్యాపారం ఇదే

Posted: 04/19/2016 11:18 AM IST
This is a romantic business

అందరికి సెక్స్ అంటే ఇష్టమే కానీ సెక్స్ కు కండోమ్ కొనాలంటే మాత్రం ఎక్కడలేని మొహమాటం అడ్డొస్తుంది. ఇలాంటి వాళ్ల కోసం శృంగారంపై విజ్ఞానం పెంచడంతో పాటు వ్యాపారాన్ని లాభసాటిగా నడవాలి. ఈ రెంటిని సమన్వయం చేస్తూ వచ్చిన ఆలోచనే మూడ్స్ ప్లానెట్. కేరళ రాజధాని తిరువనంతపురానికి చెందిన అయ్యప్పన్ కు వచ్చిన ఈ ఆలోచనే అతగాడ్ని బిజినెస్ కింగ్ ను చేసింది. మూడేళ్ల క్రితం మొదట తిరువనంతపురంలో మూడ్స్ ప్లానెట్ పేరుతో ఓ షోరూమ్ ఏర్పాటు చేశారు. అందులో అన్ని రకాల కండోమ్స్ లభిస్తాయి. శృంగారం కావాలి.. కానీ కండోమ్ కొనాలంటే సిగ్గు.. ఇలాంటి ఆలోచనలతోనే ఎయిడ్స్ లాంటి భయకంరమైన వ్యాధుల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. సిగ్గు, బిడయం వదలాలి... శృంగార సామ్రాజ్యాన్ని ఏలాలి ఇదే మూడ్స్ ప్లానెట్ సూత్రం. అయ్యప్పన్ కేవలం కండోమ్స్ అమ్మడంతో తమ పనైపోయిందనుకోలేదు.

షోరూమ్ కు వచ్చేవారికి సందేహాలు తీర్చేందుకు ప్రత్యేకంగా మనుషులను పెట్టారు. దీంతోపాటు లైంగిక విజ్ఞానాన్ని పెంచే పుస్తకాలు.. ఇలా శృంగారానికి సంబంధించిన ప్రతి ఒక్కటి షోరూమ్ లో దొరికేలా ఏర్పాటు చేశాడు. దీంతో వ్యాపారం క్లిక్ అయింది. మెల్లగా కస్టమర్లు పెరిగారు. తర్వాత గోవా, కొచ్చి, సూరత్.. ఇలా మెట్రో నగరాలన్నింటిలో షోరూమ్స్ ఏర్పాటు చేశాడు. ఇప్పడు దేశవ్యాప్తంగా దాదాపు అన్ని మెట్రో నగరాల్లో మూడ్స్ ప్లానెట్ షోరూమ్స్ ఉన్నాయి. ఆన లైన్ లోనూ ఏటా వందల కోట్ల వ్యాపారం నడుస్తోంది.కండోమ్ కొనాలంటే సిగ్గుడతారు.. కానీ శృంగారం మాత్రం కావాలి. దీనివల్ల ఎనో సమస్యలు.. యూత్ లో ఎనో డౌట్స్.. పెద్దవాళ్ళకు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనన్న ఫీలింగ్.. ఇవన్నీ వదిలేయండి.. ఒక్కసారి మూడ్స్ ప్లానెట్ లోకి వెళ్లి రండి..మీ మూడ్ ఛేంజ్ చేసుకోండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles