AP Intermediate results out now

Ap intermediate results out now

AP, Inter Results, Intermediate Results, ఇంటర్, ఇంటర్ ఫలితాలు, ఇంటర్ రిజల్ట్స్

AP Minister Ganta Srinivas release Inter First and Second year results this morning. Passing percentage increased.

ఇంటర్ ఫలితాలు విడుదల

Posted: 04/19/2016 10:46 AM IST
Ap intermediate results out now

ఏపిలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను కొద్దిసేపటి క్రితం మంత్రి గంటా శ్రీనివాస్ విడుదల చేశారు. ఏపిలో మొదటిసారిగా ఒకే రోజు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాల్లో బాలికలదే పైచేయి. మొదటి సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణత 68.05 శాతం, రెండో సంవత్సరం 73.78 శాతం. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 5శాతం మెరుగ్గా ఫలితాలున్నాయి. ఇంటర్ రెండో సంవత్సరంలో 2శాతం పాసింగ్ పెరిగింది.

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు :
ఇంటర్ ఫస్టియర్‌లో బాలికలు 72.09 ఉత్తీర్ణత సాధించగా, బాలురు 64.02 సాదించారు.

ఇంటర్ సెకండియర్ ఫలితాలు :
ఇంటర్ సెకండియర్‌లో బాలికలు 76.43 ఉత్తీర్ణత సాధించగా, బాలురు ఉత్తీర్ణత 71.12 సాధించారు.

ఫస్టియర్ 68.05, సెకండియర్ 73.78 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొత్తం ఫస్టియర్ 4,67,747 సెకండియర్ 4,11941 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్ లో 3,18,120 సెకండియర్ 3,03,934 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.ఇంటర్ ఫలితాలలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను మే 24 తేదీ నుంచి నిర్వహించనున్నట్లు మంత్రి గంటా తెలిపారు. సప్లమెంటరీ పరీక్షల ఫీజును ఏప్రిల్ 26 చివర తేదీగా ప్రకటించారు.

http://bieap.gov.in/

www.bharatstudent.com

www.schools9.com

www.sakshi.com

www.eenadu.net

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles