In Tamilnadu students earning money on behalf of elections

1500 in tamilnadu students earning money on behalf of elections

Tamilnadu, Studenmts, Elections, Tamilnaduassembly elections, తమిళనాడు, తమిళనాడు ఎన్నికలు, తమిళనాడు విద్యార్థులు

On a hot afternoon in Vriddhachalam, in Cuddalore district of Tamil Nadu, the charismatic Tamil Nadu chief minister Jayalalithaa took stage at a rally organised ahead of the May 16 Assembly polls.

ఆ విద్యార్థుల రోజు సంపాదన 1500

Posted: 04/19/2016 01:31 PM IST
1500 in tamilnadu students earning money on behalf of elections

దీపం ఉండగానే ఇల్లు సద్దుకోవాలి అని పెద్దలు అంటారు. అంటే అవకాశం ఉన్నప్పుడే దాన్ని వాడుకోవాలి లేదంటే తర్వాత మనం ఎంత ప్రయత్నించినా కానీ ఎలాంటి లాభం ఉండదు. కానీ తమిళనాడులో విద్యార్థులు మాత్రం అందివచ్చిన అవకాశాన్ని భీభత్పంగా వాడుకుంటున్నారు. రోజుకు వెయ్యి రూపాయల నుండి దాదాపు పదిహేను వందల దాకా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అదేంటి చదువుకునే విద్యార్థులు ఎలా సంపాదిస్తున్నారు అనేగా మీ డౌట్. దానికి కింద సమాదానం ఉంది. చదవండి..

తమిళనాడు శాసనసభకు మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే, డీఎండీకేతో సహా పలు చిన్నా చితకా కలిపి మొత్తం పది వరకు పార్టీలు ఉన్నాయి. ఒక్కో పార్టీ ర్యాలీ నిర్వహిస్తే, అందు కోసం కనీసం 20 వేల మందిని నేతలు సమీకరించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒకేసారి రెండు మూడు పార్టీలు ఒకేచోట ర్యాలీలు నిర్వహించాల్సి వస్తోంది. దీంతో ర్యాలీలో పాల్గొనేందుకు విద్యార్థులు సైతం ముందుకు రావడంతో వారికి బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఒక రోజు తమ వెంట ఉండి ర్యాలీ, సభలకు హాజరై జేజేలు కొట్టిన వారికి పార్టీలు ఒక్కో విద్యార్థికి 200 నుంచి 1500రూపాయల వరకూ ఇస్తున్నాయి. 'రెంట్-ఎ-క్రౌడ్' పేరిట చెన్నై పరిసరాల్లో 10 వేల మంది వరకూ, ఇతర ప్రాంతాల్లో 5 వేల మంది వరకూ విద్యార్థులను ఈవెంట్ మేనేజర్లు సరఫరా చేస్తున్నారని తెలిసింది. విద్యార్ధులు డబ్బు సంపాదించుకునేందుకు ఇదే సరైన సమయమని ఒకే రోజు రెండు ర్యాలీల్లో పాల్గొని రూ. 2 వేలకు పైగా తీసుకుంటున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles