వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారిన ద్వారక శారద పీఠాధిపతి శంకరాచార్య స్వరూపానంద సరస్వతి మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా షిరిడీ సాయిబాబా ఒక ఫకీర్ అని నిందించిన ఆయన సాయిని పూజించడం ద్వారానే మహారాష్ట్రలో కరువు విలయతాండవం చేస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక అంతటితో ఆగకుండా మహారాష్ట్రలోని శని శింగనాపూర్ ఆలయంలోకి మహిళలు వెళ్లడం వారికే ప్రమాదమనీ, దీనివల్ల స్త్రీలపై అత్యాచారాలు అధికమవుతాయని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
తాజాగా హరిద్వార్ యాత్ర చేస్తున్న శంకరాచార్య స్వరూపానంద సరస్వతి మళ్లీ వ్యాఖ్యలు చేశారు. వందలాధి మంది భక్తులను జలసమాధి చేస్తూ హిమాలయ సుమామీగా అభివర్ణించబడిన ఉత్తరాఖండ్ వరదలను ఆయన టార్గెట్ చేశారు, గత 2013 జూన్లో ఉత్తరాఖండ్లో వరదలు రావడానికి హానీమూన్, విహారయాత్రలకు వచ్చిన వారు సాగించిన అపవిత్రమైన కార్యకలాపాలే ముఖ్య కారణమన్నారు. వారి అపవిత్ర కార్యకలాపాలు వల్లే కేదారనాధ్లో ప్రకృతి విలయం సంభవించి వందలాది మంది మృతి చెందారని స్వరూపానంద సరస్వతి అన్నారు.
అంతేకాక శని శింగనాపూర్ గుడిలోకి మహిళలను అనుమతించడం వల్లే కేరళలోని పుట్టింగల్లో ప్రమాదం సంభవించిదని అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలపై అటు సాయి భక్తులు ఇటు మహాళా సంఘాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి, ఆయన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఉత్తరాఖండ్ భక్తులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇప్పటికే గత సంవత్సరం సెప్టెంబర్లో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలంటూ పిల్ దాఖలైన విషయం తెలిసిందే.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Jan 18 | మహారాష్ట్రలో ఒంటరిగా అధికారంలోకి రావడానికి ప్రస్తుతం అపసోపాలు పడుతున్న శివసేన పార్టీ.. త్వరలోనే జాతీయ పార్టీగా మాత్రం ఎదగాలని యోచనలో వుంది. అందుకు అనుగూణంగా పలు రాష్ట్రాలలో తమ సత్తాను చాటాలని ఉవ్విళ్లూరుతుంది. మహారాష్ట్రలోని... Read more
Jan 18 | కోటి రూపాయాల లంచం డిమాండ్ చేసిన రైల్వే సీనియర్ అధికారిని సీబీఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేసింది. ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూ ఇంతటి భారీ మోత్తాన్ని లంచంగా డిమాండ్ చేసి అడ్డంగా... Read more
Jan 12 | కరోనా మహమ్మారి విజృంభనతో గత మార్చి నుంచి నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఓవైపు ఉన్న ఉద్యోగాలే గాలిలో దీపాలుగా మారుతున్న క్రమంలో ఏ ఉద్యోగం దొరికినా ఫర్యాలేదని నిరుద్యోగ యువత భావిస్తున్నారు. కరోనా... Read more
Jan 12 | కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హస్తినలో రైతన్నల ఉద్యమం ఊపందుకున్న వేళ.. ఎనమిది విడతలుగా కేంద్రం అన్నదాతలతో చర్చలు జరిపినా.. అడుగుముందుకు పడక,. ప్రతిష్టంభన కొనసాగుతుంది, ఈ నేపథ్యంలో నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా,... Read more
Jan 12 | ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నగరా మ్రోగిన నేపథ్యంలో దానిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం రిట్... Read more