Slipper Hurled at JNUSU President Kanhaiya Kumar in Nagpur

Shoe hurled at kanhaiya at nagpur program

Ambedkar, Dhanwate hall, JNU, JNUSU president, Kanhaiya Kumar, Nagpur, RSS. JNU Row, Bajrang Dal, attack, slippers, shoes, Nagpur rally,

A public meeting in Nagpur saw high drama as JNU students' union president Kanhaiya Kumar was attacked with slippers and shoes as he began a speech in the city.

కన్హయ్యకు నాగ్ పూర్ లోనూ హైదరాబాద్ తరహా స్వాగతం

Posted: 04/14/2016 07:28 PM IST
Shoe hurled at kanhaiya at nagpur program

మొన్న హైదరాబాద్ లో. తాజాగా నాగ్ పూర్ లో జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ కు మరో్మారు అదే తరహా పరాభవం ఎదురైంది, హైదరాబాద్ లోని సుందరయ్య కేంద్రంలో జరిగిన సమావేశాన్ని ఇద్దరు గో సంరక్షణ అడ్డుకుని కన్హయ్యపై చెప్పులు విసిరారు, సరిగ్గా అదే తరహాలో ఇవాళ తాజాగా నాగపూర్ లో జరిగిన ఏఐఎస్ఎఫ్ సమావేశంలోనూ అదే తరహాలో పరాభవం ఎదురైంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని చేపట్టిన ర్యాలీ రసాభాసగా మారింది.

అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా జేఎన్యూ విద్యార్థి యూనియన్ ప్రెసిడెంట్ కన్హయ్య కుమార్ నిర్వహించిన ర్యాలీ అనంతర సమావేశంలో కన్హయ్యకుమార్ పై చెప్పులు విసిరాడు, దీంతో అప్రమత్తమైన ఏఐఎస్ఎఫ్ నేతలు వెంటనే ఆ వ్యక్తిపై ప్రతిదాడికి పాల్పడ్డారు, రంగంలోకి దిగిన పోలీసు బలగాలు నిందితుడని అదుపులోకి తీసుకుని, స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. నాగ్ పూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో వేదిక వద్దకు కన్హయ్య ఎక్కగానే అగంతకులు అయనపై చెప్పులు విసరడంతో పాటు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అయితే జేఎన్ యూ, హెచ్ సి యూలలో విద్యార్థుల తరపున అంధోళనలో పాల్గన్న తాను చెప్పులు పోగోట్టకున్నానని భజరంగ్ దళ్, ఏబీవీపీ సంస్థలు బాగా గుర్తుపెట్టుకున్నాయని, ఇక బయట చేస్తే ఎండలు కూడా తీవ్రంగా వున్నాయని, ఇకపై తనపై చెప్పులు విసేరే వాళ్లు ఒకటి కాకుండా జోళ్లను విసరాలని చాకచక్యంగా సమాధానమిచ్చారు. ఇకపై తనపై చెప్పులు విసురేందుకు సన్నధమయ్యే వాళ్లు.. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మరో పాదరక్షల జోడీని అదనంగా తెచ్చుకోవాలని సూచించారు. అయితే తమ గురించి అబద్దాలను ప్రచారం చేసేవాళ్లు మాత్రమే తమపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. తాము నిజాలను చెప్పడం ప్రారంభిస్తే ఎక్కడ తమ పప్పులు ఉడకవనోనని అందోళనతోనే తమపై దాడులు జరుపుతున్నారని కన్హయ్య కుమార్ పరోక్షంగా బీజేపిపై విమర్శలు గుప్పించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanhaiya Kumar  attack  slippers  shoes  Nagpur rally  

Other Articles