Senior Actress Rajasree | Jewellery | Robbed | Theft

Actress rajasree jewellery robbed

Actress Rajasree Jewellery Robbed, Actress Rajasree Jewellery Theft, Actress Rajasree gold theft, Actress Rajasree jewellery missing, Actress Rajasree latest news, Actress Rajasree stills

Actress Rajasree Jewellery Robbed: actress Rajashri's jewellery is robbed in the broad daylight on the middle of the road in Chennai.

సినీనటి రాజశ్రీ ఆభరణాలు దొంగతనం

Posted: 04/14/2016 11:06 AM IST
Actress rajasree jewellery robbed

తెలుగులో ఎన్నో క్లాసికల్ హిట్ చిత్రాలలో నటించిన నటి రాజశ్రీ... తన రిటైర్మెంట్ జీవితాన్ని చెన్నైలో గడుపుతున్నారు. అయితే తాజాగా ఈవిడ నగలను ఎవరో దొంగలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే... మంగళవారం రాజశ్రీ తన కొడుకుతో కలిసి సమీపంలోని బ్యాంక్ లాకర్లో ఉంచిన తన బంగారు ఆభరణాలను తీసుకోవడానికి వెళ్లారు.

లాకర్లో భద్రపరచిన నగలు, వజ్రపు నెక్లెస్, రోలాక్స్ వాచ్ ను తీసుకొని బయటకు వచ్చారు. అనంతరం డబ్బు డ్రా చేయడానికి శ్రీనివాస్ ఏటిఎం కేంద్రం లోపలికి వెళ్లగా, నగలతో రాజశ్రీ తన కారులో కూర్చున్నారు. అదే సమయంలో ఒక అగంతకుడు కారు వద్దకు వచ్చి పదిరూపాయల నోట్లను కింద పడేసి కారులో వున్న రాజశ్రీతో.. డబ్బులు కింద పడ్డాయి.. మీవేనా అంటూ అడిగాడు. దీంతో తన డబ్బు పడిపోయాయేమోనని భావించి కారులో నుంచి కిందకి దిగారు.

వెంటనే ఆ అగంతకుడు కారులోని నగల బ్యాగ్ ను తీసుకొని అక్కడి నుంచి ఉడాయించేసాడు. ఈ ఊహించని సంఘటనతో రాజశ్రీ దిగ్ర్భాంతికి గురయ్యారు. ఆ తర్వాత కాసేపటికి తేరుకుని పాండిబజార్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దొంగతనం జరిగిన స్థలంలో వున్న సిసి కెమెరాలు పరిశీలించారు. వీటి ఆధారంగా పోలీసులు విచారణను మరింత వేగవంతం చేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Rajasree  Jewellery  Robbed  Theft  Stills  

Other Articles