Tradition can't justify ban on women's entry in Sabarimala: SC

Courts interuption on entering women into indian temples is not good

Sabarimala row, Sabarimala women ban, Chauvinism in Hinduism, Sabarimala row women, Sabarimala Temple row, Hindu, Kerala, Sabarimala, Shani Shingnapur, Supreme Court, Trupti Desai, Women entry in Sabarimala Temple, Women entry in Sabarimala Temple

In Hindu religion, there is no denomination of a Hindu male or female. A Hindu is a Hindu,” a special three-judge bench headed by justice Dipak Misra said, stressing on gender equality.

మహిళల ఆలయ ప్రవేశాలపై కోర్టుల తీర్పులు సరికావు

Posted: 04/14/2016 11:00 AM IST
Courts interuption on entering women into indian temples is not good

ఆలయాల్లోకి మహిళలు ప్రవేశించవచ్చంటూ ఇచ్చిన కోర్టు తీర్పులు సరైనవి కావని పరిపూర్ణానంద స్వామి విమర్శించారు. సనాతన ధర్మాలను, ఆచారాలను దృష్టిలో పెట్టుకుని దేశంలోని పలు ఆలయాల్లోకి మహిళలను అనుమతించడం లేదు తప్ప.. మిగతా అన్ని ఆలయాల్లోకి మహిళలు వెళ్తున్నారని ఆయన చెప్పారు. అయితే ఆలయ విశిష్టలతకు భంగం రాకుండా, సనాతన ధర్మాలను, ఆచారాలను పరిరక్షించే అనాధిగా మహిళలను ఆలయ ప్రవేశానికి దూరంగా వుంచుతున్నారని అయన అభిప్రాయపడ్డారు.

అయితే ఇలాంటి ఆలయాల్లోకి కూడా మహిళలకు అనుమతించాలంటూ, వారి ఆలయ ప్రవేశాన్ని అడ్డుకోకూడదని న్యాయస్థానాలు తీర్పు ఇచ్చేముందు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. అన్ని అంశాలను న్యాయబద్దంగా కాకుండా ధార్మికంగా కూడా విశ్లేషించుకుని నిర్ణయం తీసుకోవాల్సి వుంటుందన్నారు. న్యాయస్థానాలు తీర్పులను వెలువరించే ముందు హిందూ ధార్మికవేత్తలతో ఒక కమిటీ వేయాలని ఆయన సూచించారు. మసీదుల్లోకి మహిళలను అనుమతించాలంటే న్యాయ స్థానాలు స్పందిస్తాయా? అని ఆయన ప్రశ్నించారు.

అయితే హిందూ మతంలో పురుష హిందువు, మహిళా హిందువు అన్న భేదమే లేదు. హిందువు అంటే హిందువేనంటూ ఈ ప్రజావాజ్యాం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేరళలోని ప్రముఖ దేవాలయం శబరిమలలో మహిళల ప్రవేశంపై శతాబ్దాలుగా ఉన్న నిషేధం ఎత్తివేత అంశంపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. హిందూ మతంలో స్త్రీ-పురుష భేదం లేదని, హిందువులంతా హిందువులేనని ఈ సందర్భంగా జడ్జిలు వ్యాఖ్యానించారు. దేవాలయాల్లోకి మహిళల రాకను అడ్డుకోవడమంటే రాజ్యాంగం వారికి ఇచ్చిన సమానత్వ హక్కును ఉల్లంఘించడమేనని వారు స్పష్టం చేశారు.

అయితే శబరిమలలోకి మహిళల రాకను నిషేధించే సంప్రదాయాన్ని కొనసాగించాల్సిందేనని ఆలయ ట్రస్టు, కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించాయి. శబరిమలలో కొలువైన అయ్యప్ప బ్రహ్మచారి అని, పిల్లలకు జన్మనిచ్చే మహిళల రాక వల్ల ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లవచ్చునని పేర్కొన్నాయి. సనాతన ఆచారాలు, సంప్రదాయాల ఆధారంగా చేసే వాదన రాజ్యాంగం కల్పించిన హక్కుల ముందు నిలబడే ఆస్కారంలేదని  సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hindu  Supreme Court  Sabarimala Temple  Women  mensuration  

Other Articles