Priyanka Chopra honoured by congress MP with golden bangle after Padma Shri

Priyanka chopra honoured with golden bangle after padma shri

Bollywood star Priyanka Chopra, Padma Shri awardee, President Prabab Mukherjee, felicitation, Rajya Sabha MP T. Subbarami Reddy, swarna kangan, gold bangle, South Indian actor Mohan Babu, Pinki Reddy, UK high commissioner Sir Dominic Asquith, US envoy Richard Verma, designer Ritu Beri, Shatrughan Sinha

Actress Priyanka Chopra is felicitated by South Indian actor Mohan Babu and Congress MP T. Subbarami Reddy. UK high commissioner Sir Dominic Asquith and US envoy Richard Verma attended the event.

ప్రియాంక చోప్రాను స్వర్ణ కంకణంతో సన్మానించిన కాంగ్రెస్ నేత

Posted: 04/13/2016 07:39 PM IST
Priyanka chopra honoured with golden bangle after padma shri

ప్రముఖ బాలీవుడ్ నటి, హాలీవుడ్లోనూ దూసుకెళ్తున్న నటి ప్రియాంక చోప్రాను రాజ్యసభ సభ్యుడు సుబ్బరామి రెడ్డి తన కళా సంస్థ సుబ్బిరామిరెడ్డి ఫౌండేషన్ తరపున సత్కరించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రియాంక చోప్రా పద్మశ్రీ అవార్డు అందుకున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని సబ్బిరామిరెడ్డి అదే రోజు సాయంత్రి నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమెను స్వర్ణ కంకణంతో సన్మానించారు. సాంస్కృతిక, కళారంగాల్లో రాణించేవారిని గుర్తించడం టీఎస్ఆర్ ఫౌండేషన్ ఆనవాయితీగా వస్తోంది.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తమ దేశానికి చెందిన ఆణిముత్యంగా ప్రియాంకను అభివర్ణించారు. ప్రియాంక తన నటనాభినయంతో దేశంలోనే కాక, ఎల్లలు దాటి తన ప్రతిభను కనబరుస్తుందని అన్నారు. అమె ప్రపంచ అభినేత్రి అని కితాబిచ్చారు. భారత్ నుంచి తొలిసారిగా అస్కార్ అవార్డు కార్యక్రమంలో పాల్గోన్న నటీమణి అని ఆయన అభివర్ణించారు, అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, అభినయంతో పాటు వినయవిధేయతలు మెండుగా వున్న అమ్మాయి ప్రియాంక అని, అమెలో ఓ గోప్ప మానవతావాది వున్నారని సుబ్బిరామిరెడ్డి పేర్కోన్నారు,

పద్మశ్రీ అవార్డు అందుకున్న ప్రియాంక చోప్రాను సన్మానించాల్సిందిగా ఆయన దక్షిణాది సినీనటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబును, తన తనయ పింకీ రెడ్డిని కోరారు. దీంతో వారు అమె చేతులకు స్వర్ణ కంకణాలను తొడిగి సన్మానించారు. ఈ కార్యక్రమానికి బ్రిటీష్ హైకమిషనర్ డోమినిక్ ఆస్కిత్, నటుడు, బిజేపి ఎంపీ శత్రఘ్న సిన్హా, అమెరికా దౌత్యాధికారి రిచర్డ్ వర్మ, డిజైనర్ రితీ భెరి, రాజకీయ నేత అమర్ సింగ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంక తనను సన్మానించిన పెద్దలకు, కార్యక్రమానికి విచ్చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు,

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : priyanka chopra  subbaramireddy  gold bangles  mohanbabu  pinki reddy  padma shri  

Other Articles