Janasena begins ground work for 2019 elections

Pawan kalyan eyes on 2019 elections plans to begin ground work for janasena

pawan kalyan eyes on 2019 elections, pavan kalyan plans to begin ground work for janasena, Pawan Kalyan Janasena bus yatra, Pawan Kalyan bus yatra, Janasena Pawan Kalyan updates, AP political news, Janasena begins ground work for 2019 elections, pawan kalyan, jana sena, actor, 2019 elections, bus yatra, pada yatra, politics, janasena party men

tollywood actor and politician, Janasena Chief, Pawan Kalyan would be performing ‘Paadha yatra’ or ‘Bus yatra’ soon to reach out andhra pradesh common people.

త్వరలో జనంలోకి సేనాని.. పవనాలు వీచేలా పవన్ యాత్రలు..

Posted: 04/12/2016 12:09 PM IST
Pawan kalyan eyes on 2019 elections plans to begin ground work for janasena

రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి తన పార్టీ పూర్తి రాజకీయ పార్టీగా అవిర్భవించనుందని, ఎన్నికలలోనూ పోటీ చేయనుందని టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పడిదే అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కల్యాన్ తన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఆ పార్టీ ఎజెండా, లక్ష్యాలు, లక్షాణాలు ఎలా వుంటాయన్న ఆసక్తి సర్వతా నెలకోంది, రాష్ట్ర రాజకీయాలలో జనసేన ప్రత్యామ్నాయ పార్టీగా మారుతుందన్న విశ్లేషణలు కూడా వినబడుతున్నాయి.

రానున్న ఎన్నికలలో క్రియాశీల భూమిక పోషించేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. గత ఎన్నికలకు ముందు 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాన్... నాడు ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టమైన ప్రకటన ఇచ్చారు, అయితే ప్రజలకు సంబంధించిన అంశాలను ఎవరు నిర్లక్ష్యం చేసినా.. వాటిని విషయమై ప్రభుత్వాలను నిలదీసేందుకు ప్రజల గొంతుకను అవుతానని ఆయన పేర్కోన్నారు, అదే విధంగా రాజధాని భూముల విషయంలో ప్రభుత్వంతో నువ్వా-నేనా అన్నట్లుగా పోరాడి ఎట్టకేలకు రైతులకు న్యాయం చేశాడు,

ఇదిలావుండగా, తన తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదల తర్వాత పవన్ కల్యాన్ దృష్టి రాజకీయాల వైపు మళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తుంది, రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక పార్టీ రావాల్సిన అవసరం వుందని అభిప్రాయానికి పవన్ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు, 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ముందుకు సాగుతున్నారు.

కాగా, తాను ఏ ఒక్క పార్టీకో గొడుగు పట్టాలని రాజకీయాలలోకి రాలేదని, ఇక 2019లో కూడా తమ పార్టీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుందన్న విషయాన్ని పవన్ కల్యాన్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యలో స్పష్టం చేయడంతో 2019 నాటికి 225 నియోజకవర్గాల్లో తమ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు ఆ పార్టీ నేతలు వ్యూహాలు కూడా రచిస్తున్నారు, అయితే 2019 నాటికి పార్టీకి అనుకూలంగా పవనాలు వీచేలా కూడా చర్యలకు పార్టీ డిసైడ్ అయినట్లు సమాచారం,

ఈ విషయంపై పవన్ కల్యాణ్ కాస్తంత పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నా, ఆయన శిబిరం మాత్రం తెర వెనుక భారీ కసరత్తే చేస్తోందని సమాచారం.  త్వరలోనే ఏపీ వ్యాప్తంగా పవన్ కల్యాణ్ జనంలోకి రానున్నారట. ఈ మేరకు పాద యాత్ర కానీ, బస్సు యాత్ర కానీ చేపడతారని తెలుస్తోంది. జనసేన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ యాత్రలు సాగనున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి జనసేనను ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడమే కాక ఒంటరిగానే పోటీ చేయాలని పవన్ కల్యాణ్ పక్కాగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ప్రజల్లో తమ పార్టీ పవనాలు మెరుగ్గా వీయడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాగించాలని, అప్పుడే పార్టీ క్షేత్రస్థాయి నుంచి బలపడుతుందని ఆయన విశ్వసిస్తున్నారు, పాదయాత్రలు, బస్సు యాత్రలు, బహిరంగ సభలను వేదికలుగా చేసుకుని వాటి ద్వారానే పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయాలని కూడా పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అయితే ఈ యాత్రలు, సభలు ఎప్పటి నుంచి చేపట్టాలన్న తేదీపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు, దీంతో జనసేన భారీ కసరత్తు చేస్తోందన్న వార్తలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిపోయాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  jana sena  actor  2019 elections  bus yatra  pada yatra  politics  janasena party men  

Other Articles